నాకెంతో ఇష్టమైన సినిమా.. రిజల్ట్ చూసి చాలా బాధపడ్డాను : విజయ్ దేవరకొండ

నాకెంతో ఇష్టమైన సినిమా.. రిజల్ట్ చూసి చాలా బాధపడ్డాను : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రష్మిక మందనా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అప్పటిలో ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. కానీ, ఓటీటీ,యూట్యూబ్ లో మాాత్రం ఈ సినిమాకి భారీ వ్యూస్ వచ్చాయి. దీంతో తాజాగా ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందనా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అప్పటిలో ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. కానీ, ఓటీటీ,యూట్యూబ్ లో మాాత్రం ఈ సినిమాకి భారీ వ్యూస్ వచ్చాయి. దీంతో తాజాగా ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

‘విజయ్ దేవరకొండ’.. గత కొన్ని రోజులుగా ఈ యంగ్ హీరో పేరు నెట్టింట వైరల్ మారుమోగుపోతున్నా విషయం తెలిసిందే. అందుకు కారణం.. నాగఆశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న కల్కి 2898 AD సినిమాలో విజయ్ ఓ పాత్రలో నటిస్తున్నడనే రూమార్ నెట్టింట వైరల్ కావడం. దీంతో ఈ హీరో పేరు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. గతంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందనా నటించిన ‘డియర్ కామ్రేడ్’ మూవీ అందరికీ గుర్తేండే ఉంటుంది. అయితే మూవీని దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించారు. ఇక ఈ సినిమా 2019 జూలై 26న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. కానీ, ఆశించిన స్థాయిలో సినిమా ప్రేక్షకులను మెప్పించ లేకపోయింది.

ఇకపోతే డియర్ కామ్రేడ్ సినిమా గురించి అప్పటిలో విజయ్, రష్మిక సౌత్ మొత్తం భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు. అయినే సరే డియర్ కామ్రేడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. అలాగే కమర్షియల్ కూడా సక్సెస్ ను అందుకోలేదు. కానీ, డియర్ కామ్రెడ్ మూవీ ఓటీటీ, యూట్యూబ్,టీవీల్లో బాగానే ఆడింది. ముఖ్యంగా ఈ మూవీ హిందీ డబ్బింగ్ కు మంచి క్రేజ్ లభించింది.అలాగే యూట్యూబ్ లో డియర్ కామ్రేడ్ హిందీ డబ్బింగ్ రే ఫుల్ డిమాండ్ ఉందని వ్యూస్ బట్టి చెప్పేయవచ్చు. ఎందుకంటే..డియర్ కామ్రేడ్ మూవీ హిందీ వెర్షన్ యూట్యూబ్ లో సుమార్ 400 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసింది. అయితే డియర్ కామ్రేడ్ మూవికి భారీ వ్యూస్ రావడంతో.. విజయ్ దేవరకొండ తాజాగా దీనిపై స్పందించారు.

ఈ సందర్భంగా విజయ్.. డియర్ కామ్రేడ్ మూవీ రిలీజ్ అయిన రోజు నేను పడిన బాధకి ఇప్పటి వరకు మాకు చాలా ప్రేమ దొరికింది. అసలు డియర్ కామ్రేడ్ మూవీ నాకు ఎంతో నచ్చిన సినిమా.. ఎంతో ఇష్టమైన కథ.. అని విజయ్ ఎమోషనల్ అయ్యాడు. అయితే విజయ్ ఇంతలా ఎమోషనల్ అవ్వడానికి కారణం.. అప్పటిలో ఈ సినిమా థియేటర్లలో అంతగా ఆదరణ పొందలేదు. కానీ, ఓటీటీ, యూట్యూబ్ ల్లో మాత్రం భారీ ఆదరణ లభించడంతో.. విజయ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే.. విజయ్ చివరగా ఫ్యామిలీ స్టార్ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. కానీ ఈ చిత్రం అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. ఓటీటీలో మాత్రం ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి, డియర్ కామ్రేడ్ మూవీ పై విజయ్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments