Joe Biden: అమెరికా అధ్యక్షుడు ఎందుకలా చేశారు...వింత ప్రవర్తనకు సంబంధించిన వైరల్ వీడియో!

Joe Biden: అమెరికా అధ్యక్షుడు ఎందుకలా చేశారు…వింత ప్రవర్తనకు సంబంధించిన వైరల్ వీడియో!

ఇటీవల అమెరిక అధ్యక్షుడు జో బైడెన ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. గతంలో వైట్ హౌస్ లో ఆయన విచిత్రంగా ప్రవర్తించగా..తాజాగా జీ7సదస్సులో మరో వింత ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు.

ఇటీవల అమెరిక అధ్యక్షుడు జో బైడెన ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. గతంలో వైట్ హౌస్ లో ఆయన విచిత్రంగా ప్రవర్తించగా..తాజాగా జీ7సదస్సులో మరో వింత ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు.

ప్రపంచంలో అమెరికాకు ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్థికంగా బలమైన దేశం కావడం, అంతేకాక సైనిక, అణ్వాయుధ సామర్థ్యం బలంగా కలిగిన దేశం. అందుకే ప్రపంచంలోనే అన్ని దేశాలు అమెరికాకు ప్రత్యేకమైన గౌరవం ఇస్తాయి. ఇలానే ఆదేశానికి చెందిన అధ్యక్షుడు అంటే ప్రపంచాని ప్రత్యేకం గౌరవం ఉంటుంది. ఆయన రాకకోసం ఎదురు చూస్తుంటారు. అలానే అమెరికా అధ్యక్షులు కూడా ఎంతో హుందగా నడుచుకుంటారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తీరు మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి.. అసలు సంగతి ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఇటలీలోని అపూలియా నగరంలో జీ7 సదస్సు జరుగుతోంది.  ఈ నేపథ్యంలో ఈ గ్రూప్ లో సభ్యత్వం కలిగిన దేశాల అధినేతలతో పాటు పలు ఆహ్వానిత దేశాల నాయకులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా గురువారం రాత్రే ఇటలీలో వెళ్లారు.  ఇది ఇలా ఉంటే ఈ అంతర్జాతీయ సదస్సులో తన వ్యవహారశైలితో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వార్తల్లో నిలిచారు. అది ఏమిటంటే.. జీ7 సదస్సుకు వచ్చిన నేతలంతా ఓ గార్డెన్ గ్రూప్‌ ఫొటోకు ఫోజు ఇచ్చారు. అదే సమయంలో అందరు నేతలు ఒకవైపు ఉంటే జో బైడెన్ మరోవైపు తిరిగి ఉన్నారు.

అంతేకాక తాను ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా మిగతవారి నుంచి కాస్తా ముందుకు వెళ్లారు. అలాగే ఎవరితోనో మాట్లాడుతున్నట్లు బైడెన్ కనిపించారు. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక్కడ విచిత్రేమేమి టంటే.. బైడెన్ నిల్చున్న వైపు ఎవరూ లేరు. మిగిలిన వారు బైడెన్ కోసం ఎంతసేపు చూసిన కూడా ఆయన మాత్రం గ్రూప్‌ ఫొటో దిగేందుకు రాలేదు. దీంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్వయంగా వెళ్లి బైడెన్ తీసుకువచ్చారు. దీంతో మిగిలిన నేతలతో కలిసి ఆయన ఫొటో దిగారు. ఈ ఘటనను వీక్షించిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్నాళ్ల క్రితం వైట్‌హౌస్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో కూడా ఆయన ఇలాగే ప్రవర్తించారు.

వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల బైడెన్ జ్ఞాపకశక్తిలో లోపాలను గుర్తించినట్లు గతంలో ఒక నివేదిక పేర్కొంది. అమెరికా అధ్యక్షుడి జ్ఞాపకశక్తి చాలా ‘‘మసక’’గా, ‘‘మబ్బు’’గా ఉందని  ఆ నివేదిక పేర్కొంది. జీవితంలోని కీలక సంఘటనలను సైతం ఆయన గుర్తుకు తెచ్చుకోలేకపోయారని తెలిపింది. ఆయన కొడుకు బ్యూ బైడెన్‌ ఎప్పుడు మరణించాడు అనే విషయం కూడా జ్ఞప్తికి రాలేదని నివేదిక పేర్కొంది. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని తెలిపింది. ఈ నివేదికను అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ డెమోక్రాటిక్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.

Show comments