వీడియో: అవుట్‌పై విరాట్‌ కోహ్లీకి ముగ్గురు అంపైర్ల వివరణ! అయినా కూడా..

వీడియో: అవుట్‌పై విరాట్‌ కోహ్లీకి ముగ్గురు అంపైర్ల వివరణ! అయినా కూడా..

Virat Kohli, No Ball, RCB vs KKR: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అవుటైన తీరుపై తీవ్ర రచ్చ రాజుకుంది. ఈ విషయంలో స్వయంగా అంపైర్లే కోహ్లీని శాంతిపజేసే పనిలో పడ్డారు. అయితే.. ఆ టైమ్‌లో కోహ్లీ రియాక్షన్‌ ఏంటో మీరే చూడండి.

Virat Kohli, No Ball, RCB vs KKR: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అవుటైన తీరుపై తీవ్ర రచ్చ రాజుకుంది. ఈ విషయంలో స్వయంగా అంపైర్లే కోహ్లీని శాంతిపజేసే పనిలో పడ్డారు. అయితే.. ఆ టైమ్‌లో కోహ్లీ రియాక్షన్‌ ఏంటో మీరే చూడండి.

కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అవుటై తీరు తీవ్ర వివాదానికి దారి తీసింది. ఫుల్‌ టాస్‌గా నడుము కంటే పైకి వచ్చిన బాల్‌ను నో బాల్‌ ఇవ్వకుండా తనను అవుట్‌గా ప్రకటించారని, ఇవేం రూల్స్‌ అంటూ విరాట్‌ కోహ్లీ గ్రౌండ్‌లోనే అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్‌ అభిమానులతో పాటు, మాజీ క్రికెటర్లు కొంతమంది కోహ్లీ అవుట్‌ కాదని, అది నో బాల్‌ అంటూ.. కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే.. కోహ్లీ లాంటి బిగ్‌ ప్లేయర్‌ గ్రౌండ్‌లో అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం, రూల్స్‌ విషయంలో అసంతృప్తిగా ఉండటంతో.. స్వయంగా అంపైర్లే కోహ్లీకి ఆ రూల్‌ గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన మ్యాచ్‌ తర్వాత చోటు చేసుకుంది. ముగ్గురు అంపైర్లు ఆ అవుట్‌ గురించి కోహ్లీతో మాట్లాడుతూ.. ఎందుకు అవుట్‌ ఇవ్వాల్సి వచ్చిందో వివరించారు.

ఐసీసీ రూల్స్‌ ప్రకారం ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో బ్యాటర్‌ ఎక్కడైతే బాల్‌ను కాంటాక్ట్‌ చేస్తాడో.. అక్కడి నుంచి పరిగణంలోకి తీసుకుని.. ఆ బాల్‌ నడుముకంటే ఎత్తులో ఉంటే దాన్ని నో బాల్‌ గాను, నడుము కంటే తక్కువ ఎత్తులో ఉంటే లీగల్‌ డెలవరీగానూ పరిగణిస్తారు. కానీ, ఈ ఐపీఎల్‌ సీజన్‌లో బీసీసీఐ కొత్త రూల్‌ను తీసుకొని వచ్చింది. గ్రౌండ్‌ నుంచి బ్యాటర్‌ నడుముకు ఉన్న ఎత్తును కొలుచుకుని.. అదే ప్రతిపాదికగా.. క్రీజ్‌లో ఉన్న బ్యాటర్‌ ఉండగా.. బాల్‌ ఆ ఎత్తు నుంచి పైకి వెళ్తే నో బాల్‌గానూ, కిందికి వెళ్తే లీగల్‌ డెలవరీగానూ భావిస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ బాల్‌ను బ్యాట్‌తో కనెక్ట్‌ చేసిన సమయంలో కోహ్లీ నడుము కంటే బాల్‌ చాలా ఎత్తుగా ఉండి క్లియర్‌గా నో బాల్‌గా కనిపించింది.

కానీ, బీసీసీఐ రూల్స్‌ ప్రకారం పాపింగ్‌ క్రీజ్‌ వరకు బాల్‌ ట్రాకింగ్‌ చూస్తే మాత్రం.. బాల్‌ డిప్‌ అవుతూ.. కోహ్లీ నడుము కంటే తక్కువ ఎత్తులో వెళ్తోంది. గ్రౌండ్‌ నుంచి కోహ్లీ నడుము 1.04 మీటర్లు ఉండగా, బాల్‌ 0.92 మీటర్ల ఎత్తులో వెళ్తుంది. మరో 0.13 మీటర్ల ఎత్తులో వెళ్లి ఉంటే అది నో బాల్‌ అయ్యేది కోహ్లీ అవుట్‌ నుంచి బతికిపోయేవాడు. కానీ, రూల్స్‌ ప్రకారం కోహ్లీ అవుట్‌ అయ్యాడు. ఇదే విషయాన్ని అంపైర్లు కోహ్లీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, చాలా సేపు అంపైర్లతో ఈ విషయంపై చర్చించిన కోహ్లీ.. ఆ రూల్‌పై ఇంకా అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ ఆ విధంగా అవుట్‌ కాకపోయి ఉంటే.. కచ్చితంగా ఫలితం వేరేలా ఉండేదని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. కేవలం 6 బంతుల్లోనే 18 పరుగులు చేసి కోహ్లీ.. మంచి టచ్‌లో కనిపించాడు. కానీ, దురదృష్టవశాత్తు.. 7 బంతుల్లో 18 రన్స్‌ చేసి అవుట్‌ అయ్యాడు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ అవుట్‌తో పాటు, అంపైర్లు కోహ్లీకి అవుట్‌పై వివరణ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments