Adhaar ఉచిత అప్‌డేట్‌పై UIDAI కీలక నిర్ణయం.. గడువు మరోసారి పొడిగింపు

Adhaar ఉచిత అప్‌డేట్‌పై UIDAI కీలక నిర్ణయం.. గడువు మరోసారి పొడిగింపు

ఆధార్ కార్డు ఉచిత అప్ డేట్ విషయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు గడువును మరోసారి పొడిగించింది. ఎప్పటి వరకు అంటే?

ఆధార్ కార్డు ఉచిత అప్ డేట్ విషయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు గడువును మరోసారి పొడిగించింది. ఎప్పటి వరకు అంటే?

కేంద్ర ప్రభుత్వం భారత పౌరులకు జారీ చేసిన ఆధార్ కార్డులు ఎంతో ఉపయోగకరంగా మారాయి. నేడు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా, వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయాలన్నా ఆధార్ కార్డులు కీలకంగా మారాయి. ఆధార్ కార్డుపై ఆ వ్యక్తికి సంబంధించిన పేరు, అడ్రస్, వయసు వంటి వివరాలు ఉంటాయి. దీన్ని గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే కొంత కాలం నుంచి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 10 సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోని వారు త్వరగా చేసుకోవాలని సూచిస్తున్నది. ఇందుకోసం ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు గడువు విధించింది. అయితే ఈ గడువు జూన్ 14తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి గడువును పెంచింది. ఎప్పటి వరకంటే?

యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మరి మీరు మీ ఆధార్ కార్డును ఇంకా అప్ డేట్ చేసుకోలేదా? అయితే టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుండడంతో యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డును ఫ్రీగా అప్ డేట్ చేసుకునేందుకు గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 2024 జూన్‌ 14తో గడువు ముగియనుండగా.. తాజాగా సెప్టెంబర్‌ 14 వరకు పెంచింది. దీంతో ఆధార్‌ కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలనుకొనేవారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఉచిత సేవలు ‘మై ఆధార్‌’ పోర్టల్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. గడువు ముగిసిన తర్వాత అప్ డేట్ చేసుకుంటే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

ఆన్‌లైన్‌లో అప్ డేట్ ఇలా చేసుకోండి:

  • ముందుగా https://myaadhaar.uidai.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
  • మీ ఆధార్ నెంబర్, క్యాప్చాలను ఎంటర్ చేయాలి. ఆధార్ తో అనుసంధానమై ఉన్న మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటిపీ ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ కావాలి.
  • డాక్యూమెంట్ అప్ డేట్ సెక్షన్ లోకి వెళ్లి, మీ వ్యక్తిగత వివరాలను చెక్ చేసుకోవాలి.
  • మార్పు అవసరమైన వివరాలను గుర్తించి, వెరిఫికేషన్ కోసం సంబంధిత ఒరిజినల్ డాక్యుమెంట్ స్కాన్డ్ కాపీని అప్ లోడ్ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ను నోట్ చేసి పెట్టుకోవాలి.
Show comments