Tyre Inflator Cum Power Bank: పవర్ బ్యాంక్‌గా, బైక్, కార్ టైర్ గాలి పంపుగా వాడుకోవచ్చు.. అతి తక్కువ ధరకే!

పవర్ బ్యాంక్‌గా, బైక్, కార్ టైర్ గాలి పంపుగా వాడుకోవచ్చు.. అతి తక్కువ ధరకే!

Tyre Inflator Cum Power Bank: ఒకే డివైజ్ లో మూడు లాభాలు ఉంటే చాలా బాగుంటుంది కదా. అది కూడా కేవలం అతి తక్కువ ధరకే దొరుకుతుంటే ఆ ఆనందమే వేరు. పవర్ బ్యాంక్ గా, కారు లేదా బైక్ వంటి వాహనాల టైర్లలో గాలి నింపుకునే డివైజ్ గా, ఫ్లాష్ లైట్ గా వాడుకునే డివైజ్ ని మీరు చాలా తక్కువ ధరకే పొందవచ్చు.

Tyre Inflator Cum Power Bank: ఒకే డివైజ్ లో మూడు లాభాలు ఉంటే చాలా బాగుంటుంది కదా. అది కూడా కేవలం అతి తక్కువ ధరకే దొరుకుతుంటే ఆ ఆనందమే వేరు. పవర్ బ్యాంక్ గా, కారు లేదా బైక్ వంటి వాహనాల టైర్లలో గాలి నింపుకునే డివైజ్ గా, ఫ్లాష్ లైట్ గా వాడుకునే డివైజ్ ని మీరు చాలా తక్కువ ధరకే పొందవచ్చు.

మీరు బైకు మీదనో లేక కారు మీదనో వెళ్తున్నారు. చాలా లాంగ్ జర్నీ చేశారు. కానీ సడన్ గా మీ వెహికల్ టైరులో గాలి తగ్గిపోయింది. దగ్గరలో మెకానిక్ షాప్స్ ఏమీ లేవు. చీకటి పడుతుంది. క్యాబ్స్ కూడా బుక్ చేయలేని ప్రాంతం అది. కారులో ఇంకో టైర్ లేదు. బైక్ కి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు? బైక్ అయితే తోసుకుంటూ వెళ్ళాలి. లేదా ఏ లారీ మీదనో ఎక్కించి రావాలి. మరి కారు అయితే వదిలేసి రావాలి. ఇవి తప్ప వేరే ఏం చేయలేరు. ఫోన్ ఉంది కాబట్టి ఎవరో ఒకరికి కాల్ చేస్తే సహాయం చేస్తారు కదా అని అనుకుంటే సపోజ్ ఛార్జింగ్ లేదు. అప్పుడు ఏం చేస్తారు. అప్పుడు ఏం చేయలేరు కాబట్టి ఇప్పుడే ఈ పని చేయండి.

మీకు ఫోన్ ఛార్జింగ్ అయినప్పుడు పవర్ బ్యాంక్ గా పని చేస్తుంది. బైకు, కారు వంటి వాహనాల టైర్లలో గాలి తగ్గినా, పోయినా గానీ నింపడానికి ఇది సహాయపడుతుంది. మీకు రోడ్డు కనబడకపోతే టార్చ్ లైటులా కూడా పని చేస్తుంది. అసలు ఈ ప్రాడెక్ట్ చాలా వైవిధ్యంగా ఉంది. మొబైల్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ ని వాడుకోవడం అనేది మామూలే. కానీ ఆ పవర్ బ్యాంక్ తో బైకు, కారు, సైకిల్ వంటి వాటి టైర్స్ లో గాలి నింపుకోవడం అనేది వెరైటీగా ఉంది. 

ఈ ప్రాడెక్ట్ పేరు అగరో గెలాక్సీ కార్డు లెస్ టైర్ ఇన్ఫ్లేటర్ కమ్ పవర్ బ్యాంక్ కమ్ ఎల్ఈడీ ఫ్లాష్ లైట్. దీన్ని మీరు మొబైల్ ఫోన్ కి పవర్ బ్యాంకుగా వాడుకోవచ్చు. కారు, బైక్, సైకిల్ టైర్స్, ఫ్లోటింగ్ ట్యూబ్, ఫుట్ బాల్ వంటి వాటిలో గాలి నింపుకునే సాధనంగా వాడుకోవచ్చు. ఫ్లాష్ లైట్ గా కూడా వాడుకోవచ్చు. ఇది 2×2000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇది చాలా లైట్ వెయిట్ తో ఉంటుంది. ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. దీన్ని వాడుకోవడానికి అదనంగా పవర్ కనెక్షన్ అనేది అవసరం లేదు. ఛార్జింగ్ పెట్టుకుని పోర్టబుల్ డివైజ్ గా వాడుకోవచ్చు.

ఒక్కటే డివైజ్ కానీ మూడు రకాల ప్రయోజనాలు పొందవచ్చు. రీఛార్జబుల్ టైప్ సీ పోర్టుతో వస్తుంది. డిజిటల్ డిస్ప్లేతో వస్తున్న కారణంగా టైర్ ప్రెజర్ సెట్ చేసుకుని గాలి నింపుకోవచ్చు. అయితే బయట ఎయిర్ ఫిల్ చేసే షాప్స్ దగ్గర వేగంగా అంటే నిమిషంలో ఎక్కినట్టు గాలి దీని వల్ల ఎక్కదు. కొంచెం టైం పడుతుంది. బైక్ లేదా కారు టైర్ లో గాలి నింపడానికి కొన్ని నిమిషాల సమయం పడుతుంది. బయట అర నిమిషం సమయం పడితే ఇక్కడ రెండు నిమిషాలు పడుతుంది. ఇదసలు పెద్ద మేటరే కాదు. నిర్మానుష్య ప్రదేశాల్లో అసలు ఆ సమయానికి ఇది దొరకడమే గగనం. దీని అసలు ధర ఆన్ లైన్ లో రూ. 4,499 ఉండగా.. కేవలం రూ. 2,298కే మీరు సొంతం చేసుకోవచ్చు. 

‘బ్రాండ్ అగరో.. మీరు కారు మీద, బైక్ మీద బయటకు వెళ్తున్నప్పుడు ఒకసారి ఆగరో’ అని అంటుంది. కాబట్టి మీరు ఈ ప్రాడెక్ట్ ని కొనుక్కుంటే చాలా ఉపయోగపడుతుంది.

Show comments