TTD గుడ్ న్యూస్..మహిళా భక్తులకు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు!

TTD గుడ్ న్యూస్..మహిళా భక్తులకు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు!

Good News For TTD Devotees: తరచూ శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, కీలక సమాచారం అందిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా స్వామివారి దర్శనం, ఇతర కీలక సమాచారాన్ని భక్తులకు తెలియజేస్తుంటుంది. తాజాగా పాలకమండలి సమావేశంలో భక్తుల కోసం ఓ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Good News For TTD Devotees: తరచూ శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, కీలక సమాచారం అందిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా స్వామివారి దర్శనం, ఇతర కీలక సమాచారాన్ని భక్తులకు తెలియజేస్తుంటుంది. తాజాగా పాలకమండలి సమావేశంలో భక్తుల కోసం ఓ కీలక నిర్ణయాలు తీసుకుంది.

తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం అనేది హిందూ భక్తులకు ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ ప్రతి అంశాన్ని వారు ఎంతో సెంటిమెంట్ గా, పవిత్రంగా భావిస్తారు. ఇక తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడికి సంబంధించిన పూజలు, ఆయనకు సంబంధించిన వస్తువులను పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే భక్తుల మనోభావాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా  ఓ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇది శ్రీవారి మహిళ భక్తులకు శుభవార్తే అని చెప్పాలి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

సోమవారం తిరుమల తిరుపతి పాలక మండలి సమావేశం నిర్వహించింది. టీటీడీ  ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇక ఈ మీటింగ్ లో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.5141.74 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోద ముద్ర వేసింది.  ఇదే సమయంలో హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా.. బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులను భక్తులకు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. బంగారు డాల్లర్లు తరహలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తామని టిటిడి చైర్మన్ వెల్లడించారు. మహిళలు కోసం మంగళసూత్రాలను, లక్ష్మీకాసులను తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. లాభాపేక్ష లేకుండా వీటిని విక్రయిస్తామ‌ని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. హైందవస్త్రీలకు ఈ మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు ఒక అమూల్యమైన కానుక అని పేర్కొన్నారు.

ఇదే సమయంలో మరికొన్ని ఇతర అంశాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం పడింది. అదే విధంగా లడ్డుల ట్రేను మోసే కార్మికుల వేతనాలు రూ.15 వేలు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలానే వేద పాఠశాలల్లో 51 మంది సంభావన గురువులకు జీతం రూ.34 వేల నుంచి రూ.54 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 దేవాలయాల్లో పని చేసేందుకు నూతనంగా పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం తీసుకుంది.

ఇక, ఈ సమావేశంలో స్విమ్స్ ఆసుపత్రిలో 300 పడకల నుంచి 1200 పడకల పెంపుకు రూ.148 కోట్లతో టెండర్ కి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.  సప్తగిరి సత్రాల్లో అభివృద్ధి పనులకు రూ.2.5 కోట్లు కేటాయించారు. ఎస్ఎంసీతో పాటు పలు కాటేజీల ఆధునీకరణకు రూ.10 కోట్లు విడుదల చేశారు. అన్నమయ్య భవన్ అభివృద్ధికి రూ.1.47 కోట్లు కేటాయించారు. రూ. 30కోట్లతో గోగర్భం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మరి..టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments