వైద్యాధికారిగా ఎంతో మందికి సేవలందించారు.. కానీ..!

వైద్యాధికారిగా ఎంతో మందికి సేవలందించారు.. కానీ..!

పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు భవ్యశ్రీ. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదువుకున్నారు. ఎలాగైన వైద్యురాలిగా మారి పేద ప్రజలకు సేవ చేయాలని భావించారు. ఆమె అనుకున్నట్లుగానే ప్రభుత్వ వైద్యురాలిగా మారి ప్రజలకు సేవలు అందించారు. కూతురిని ఇలా చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యారు. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో భవ్యశ్రీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇదంతా కలనా లేక నిజమా అనేది తెలుసుకోలేపోతున్నారు. ఇంతకు అసలేం జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో యానంలో భవ్య శ్రీ అనే యువతి నివాసం ఉంటున్నారు. ఈమె శ్రీకాకుళం మండలం వైద్యాధికారిణిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంతో మంది పేద ప్రజలకు సేవలు అందిస్తూ మంచి పేరును సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే.. గురువారం షీలా నగర్ లో జరిగిన డిపార్ట్ మెంట్ పరీక్షకు హాజరయ్యారు. ఇక పరీక్ష అనంతరం భవ్యశ్రీ గాజువాకలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లాలని అనుకున్నారు. దీంతో ఆమె స్కూటీపై వెళ్తుండగా వెనకాల నుంచి ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భవ్యశ్రీ స్కూటీపై నుంచి ఎగిరి కిందపడడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇది కలనా లేక నిజమా అనేది తెలుసుకోలేకపోయారు. భవ్య శ్రీ మృతితో స్థానిక ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు.

ఇది కూడా చదవండి: తల్లిని చంపిన పాపం.. కొడుకు రూపంలో వెంటాది..!

Show comments