3 Cr Rent For Office Space: HYDలో నెలకు 3 కోట్ల రూపాయల అద్దె! వామ్మో సిటీ రేంజే మారిపోయిందిగా..

HYDలో నెలకు 3 కోట్ల రూపాయల అద్దె! వామ్మో సిటీ రేంజే మారిపోయిందిగా..

3 Cr Rent For Office Space: హైదరాబాద్ రేంజ్ ఇప్పుడు మారిపోయింది. ఇక్కడ రెంట్లు ముంబై, బెంగళూరు నగరాన్ని తలపిస్తున్నాయి. రెసిడెన్షియల్ లోనే కాకుండా ఆఫీస్ స్పేస్ విషయంలో కూడా హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. టాప్ మల్టీ నేషనల్ కంపెనీలన్నీ ఇప్పుడు హైదరాబాద్ లో కార్యాలయాలకు స్థలం కోసం ఎగబడుతున్నాయి.

3 Cr Rent For Office Space: హైదరాబాద్ రేంజ్ ఇప్పుడు మారిపోయింది. ఇక్కడ రెంట్లు ముంబై, బెంగళూరు నగరాన్ని తలపిస్తున్నాయి. రెసిడెన్షియల్ లోనే కాకుండా ఆఫీస్ స్పేస్ విషయంలో కూడా హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. టాప్ మల్టీ నేషనల్ కంపెనీలన్నీ ఇప్పుడు హైదరాబాద్ లో కార్యాలయాలకు స్థలం కోసం ఎగబడుతున్నాయి.

హైదరాబాద్ నగరం ముంబై, బెంగళూరు నగరాలతో పోటీ పడుతుంది. పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతుండడంతో సిటీ రేంజే మారిపోయింది. మరోసారి పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో కార్యాలయాలు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలన్నీ హైదరాబాద్ లోని ప్రముఖ ఏరియాల్లో ఆఫీస్ స్పేస్ ల కోసం ఎగబడుతున్నాయి. రీసెంట్ గా ప్రముఖ కంపెనీలు ఏకంగా 8.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీసు స్పేస్ ని లీజ్ కి తీసుకున్నాయి. ఈ ఆఫీస్ స్పేస్ రెంట్ ఒక్కో దానికి నెలకు 70 లక్షల నుంచి 3.15 కోట్ల రూపాయల వరకూ ఉన్నాయి. మే 28న క్వాల్ కామ్ ఇండియా, ఎస్ అండ్ పీ క్యాపిటల్ ఐక్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఐబీఎం ఇండియా, ఎల్టీఐ మైండ్ ట్రీ వంటి టాప్ కంపెనీలు హైదరాబాద్ లో వేర్వేరు చోట్ల పెద్ద మొత్తంలో ఆఫీస్ స్పేస్ ని లీజుకి తీసుకున్నట్లు తెలుస్తోంది.    

ఎల్టీఐ మైండ్ ట్రీ: 

ఎల్టీఐ మైండ్ ట్రీ మైండ్ ట్రీ సంస్థ హైటెక్ సిటీలో స్కైవ్యూ భవనంలో 1.09 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని లీజుకి తీసుకుంది. అందుకోసం నెలకు 89.18 లక్షల అద్దె చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. 14, 15 ఫ్లోర్లలో ఆఫీస్ స్పేస్ ని లీజుకు తీసుకోగా.. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 6.2 కోట్లు చెల్లించింది. 

ఐబీఎం కంపెనీ:

గచ్చిబౌలిలోని దివ్యశ్రీ ఓరియాన్ లో ఉన్న 26 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లీజుకు తీసుకుంది. 1.06 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకి తీసుకున్న ఐబీఎం కంపెనీ.. సెక్యూరిటీ డిపాజిట్ కింద 4.21 కోట్లు చెల్లించింది. కాగా నెలకు రూ. 70.23 లక్షలు అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 10, 11 ఫ్లోర్స్ ని ఆఫీస్ స్పేస్ కోసం మిదాస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో డీల్ కుదుర్చుకుంది.

ఎస్ అండ్ పీ క్యాపిటల్ ఐక్యూ ఇండియా:

హైటెక్ సిటీ స్కైవ్యూ భవనంలోని ఎస్ అండ్ పీ క్యాపిటల్ ఐక్యూ ఇండియా 2.41 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్పేస్ ని లీజుకు తీసుకుంది. 19, 20, 21 ఫ్లోర్లలో ఆఫీస్ స్పేస్ ని తీసుకుంది. ఇందుకోసం నెలకు 1.77 కోట్ల రూపాయల అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద 10.6 కోట్లు చెల్లించింది. లీజ్ పీరియడ్ ఐదేళ్ల వరకూ ఉండగా.. మరో 15 ఏళ్లు పొడిగించుకునే వీలుంది.      

క్వాల్ కామ్ కంపెనీ:

క్వాల్ కామ్ కంపెనీ హైటెక్ సిటీలో ఏకంగా 4.14 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ప్రైమ్ ది స్కైవ్యూ భవనంలోని 18 నుంచి 22 ఫ్లోర్లను ఆఫీస్ స్పేస్ కోసం లీజుకు తీసుకుంది. అందుకోసం నెలకు రూ. 3.15 కోట్ల అద్దె చెల్లించేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇప్పటికే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 16.4 కోట్లు చెల్లించింది. దివిజ కమర్షియల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

Show comments