Traffic Restrictions: హైదరాబాద్ వాసులకు అలెర్ట్...రేపు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు!

హైదరాబాద్ వాసులకు అలెర్ట్…రేపు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు!

Traffic Restrictions: హైదరాబాద్ నగరంలో ప్రత్యేక పర్వదినాలు, పండగలు, ఇతర వేడుకలు జరిగినప్పుడు పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. రేపు కూడా వాహనదారులకు నగర పోలీసులు కీలక సూచనలు చేశారు.

Traffic Restrictions: హైదరాబాద్ నగరంలో ప్రత్యేక పర్వదినాలు, పండగలు, ఇతర వేడుకలు జరిగినప్పుడు పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. రేపు కూడా వాహనదారులకు నగర పోలీసులు కీలక సూచనలు చేశారు.

భాగ్య నగరంలో ఉండే  ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాహనదారులు  ట్రాఫిక్ సమస్యతో నరకం చూస్తుంటారు. మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో కాస్తా మేర ఉపశమనం లభించింది.  అయినా కూడా  పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. అలానే నగరంలో ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సంగతులు ఇలా ఉంటే.. ప్రత్యేక సందర్భాల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు.  అదే విధంగా తాజాగా కూడా హైదబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు  కీలక సూచనలు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్ నగరంలో ప్రత్యేక పర్వదినాలు, పండగలు, ఇతర వేడుకలు జరిగినప్పుడు పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. తాజాగా కూడా హైదరాబాద్‌లోని వాహనదారులకు ట్రాఫిక్ విషయంలో ఓ ముఖ్య గమనిక వెలువడింది. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రేపు ముస్లింల పవిత్ర పండుగైన బక్రీద్‌ పండగ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముస్లిం  సోదరులు ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ట్రాఫిక్ ఆంక్షలతో పాటు పలు ఏర్పాట్లు చేశారు. నగరంలోని ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.

ఇక బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు జరిగే పరిసర ప్రాంతాల్లో వాహనాలనుపై ఆంక్షలు విధించారు. ప్రార్ధనలు జరిగే ప్రాంతాల్లో వాహనాదురులు వెళ్లకుండా వేరే దారుల్లోకి మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రార్ధనలు జరిగే మీరాలం ఈద్గా పరిసర ప్రాంతాల్లో వెహికల్స్ ను వేరే మార్గాలకు మళ్లించనున్నట్లు పోలీసులు వివరించారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లోని రోడ్లపై వాహనాల రాకపోకలను ఆపేయనున్నట్లు అధికారులు చెప్పారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు మీరాలం ఈద్గా ప్రాంతంలో వాహనాలకు అనుమతి లేదు. అటుగా వెళ్లే వాహనాలను వేరే మార్గాలకు మళ్లించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అదే విధంగా బహదూర్‌పురా క్రాస్‌ రోడ్ మీదుగా ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల మధ్య పురానాపూల్‌, కామాటిపురా, కిషన్‌బాగ్‌ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే అనుమతించనున్నట్లు పోలీసులు తెలిపారు.  ఇదే సమయంలో ప్రార్థనలకు వచ్చేవారికి పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జూ పార్కు, మసీద్‌ అల్హా హో అక్బర్‌ ఎదురుగా ఉండే ప్రాంతంలో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రేపు బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. రేపు పాత బస్తీలో సుమారు 1000 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని వారు తెలిపారు.

Show comments