Pic Talk: ఈ చిన్నారి టాలీవుడ్ టాప్ హీరోయిన్.. సరైన హిట్టు పడక సతమతమౌతుంది

ఈ చిన్నారి టాలీవుడ్ టాప్ హీరోయిన్.. సరైన హిట్టు పడక సతమతమౌతుంది

ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ క్యూటీ.. టాప్ హీరోయిన్లలో ఒకటి. తెలుగులో 10 సినిమాలు చేసింది కానీ.. సరైన హిట్టు లేక సతమతమౌతుంది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరో చెప్పుకోండి.

ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ క్యూటీ.. టాప్ హీరోయిన్లలో ఒకటి. తెలుగులో 10 సినిమాలు చేసింది కానీ.. సరైన హిట్టు లేక సతమతమౌతుంది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరో చెప్పుకోండి.

ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో రాణించాలన్న ఉద్దేశంతో ఎంతో మంది అమ్మాయిలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. కొంత మంది ఫస్ట్ లేదా రెండు మూడు చిత్రాలతో క్లిక్ అయ్యి.. స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తుంటారు. గోల్డెన్ హ్యాండ్ అన్న ముద్ర పడిపోతుంది. వరుసగా ఛాన్సులు.. కాల్షీట్లు కూడా ఖాళీ ఉండవు. మరికొంత మంది ముద్దుగుమ్మలు.. వర్త్ వర్మ అన్న పేరు తెచ్చుకుంటారు కానీ.. ఎందుకు వెనకబడిపోతుంటారు. హిట్ పడినా కూడా నత్త నడకన సాగుతూ ఉంటుంది వారి కెరీర్. ఈ కాంపిటీషన్ రంగంలో మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ.. తాము ఇండస్ట్రీలో ఉన్నాం అని చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి గట్టిగా ఒక్క సూపర్ హిట్ మూవీ పడితే.. కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు కాపు కాయం ఖాయం.

ఇదిగో ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న ఈ పాప కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆమెతో పాటు.. ఈ అమ్మాయి కన్నా వెనుక కెరీర్ స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మలు రాకెట్ వేగంతో దూసుకెళుతూ.. కోట్లలో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఈ నటి మాత్రం మెల్లిగా కెరీర్ నెట్టుకొస్తుంది. దక్షిణాది ఇండస్ట్రీలో తమిళ్, తెలుగులో సినిమాలతో పాటు బాలీవుడ్ నాట కూడా అడుగుపెట్టింది. కానీ స్టార్ డమ్ కు కూసింత దూరంలో ఆగిపోతుంది. ఇంతకు ఆ కథానాయకి ఎవరంటే.. మేఘా ఆకాష్. ఇప్పటి వరకు తెలుగులో పది సినిమాలు చేసినా.. ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు. అలా అని వెనకబడిపోలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగ పర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది ఈ తమిళ పొన్ను. మేఘా ఆకాశ్ పేరుకు తమిళ అమ్మాయి అయినప్పటికీ.. ఆమెకు తెలుగుతో మంచి టచ్ ఉంది.

ఆమె తెలుగు తండ్రికి, మలయాళీ పుట్టిన హై బ్రీడ్ పిల్ల. చదువుంతా చెన్నైలో సాగింది. 2017లో తెలుగు మూవీ లైతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ ఓకే అనిపించింది. వెంటనే మళ్లీ నితిన్ సరసన చల్ మోహన్ రంగాలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో రాజ రాజ చోర, డియర్ మేఘ, గుర్తుందా శీతాకాలం, ప్రేమ దేశం వంటి చిత్రాలు వచ్చినప్పటికీ.. ఆమె కెరీర్‌కు ప్లస్ కాలేదు. హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రవితేజ మూవీ రావణాసుర, బూ లాంటి బైలింగ్వల్ మూవీ చేసింది. మను చరిత్రలో ఆఖరుగా కనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలున్నాయి. సహ కుటుంబంతో సహా రెండు తెలుగు ప్రాజెక్టులు. ఓ తమిళ సినిమా చేస్తుంది. ఈమె తర్వాత కెరీర్ స్టార్ట్ చేసిన తారామణులు స్టార్ హీరోయిన్లు అయిపోతే.. ఆమె మాత్రం ఇంకా స్టార్ హోదాకు దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు రూమర్ కూడా వచ్చింది.

Show comments