Brahmaji: హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల వరుస దాడులు.. బ్రహ్మజీ ఫన్నీ రిప్లయ్!

Brahmaji: హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల వరుస దాడులు.. బ్రహ్మజీ ఫన్నీ రిప్లయ్!

సినీ నటుడు బ్రహ్మజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదో అంశంపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్ లోని హోటల్స్ పై జరుగుతున్న దాడులు ఇష్యూపై ఆయన ఫన్నీగా రిప్లయ్ ఇచ్చారు.

సినీ నటుడు బ్రహ్మజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదో అంశంపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్ లోని హోటల్స్ పై జరుగుతున్న దాడులు ఇష్యూపై ఆయన ఫన్నీగా రిప్లయ్ ఇచ్చారు.

గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌లో ఆహార భద్రత అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్‌ వంటి వాటిల్లో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో పలు హోటల్లో ఆహార నాణ్యత విషయంలో ప్రమాణాలు పాటించకపోవడం వంటివి బయట ఎక్స్‌పైరీ అయిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. పలు హోటల్‌ యజమానులకు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ దాడులతో ఆహార ప్రియుల గుండెల్లో దడ మొదలైంది. ఇదే సమయంలో చాలా మంది ఈ దాడులపై స్పందిస్తున్నారు. తాజాగా సినీ నటుడు బ్రహ్మజీ ఫన్నీగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల  మీడియాలో వైరల్ అవుతోంది.

మారుతున్న జీవనశైలీ కారణంగా బయటి  పుడ్ తినే వారి సంఖ్య బాగా పెరిగింది. వండుకునే ఓపికలేక కొందరు, రెస్టారెంట్‌ ఫుడ్‌ తినాలనే కోరికతో మరికొందరు బయటి ఆహారం తీసుకుంటున్నారు. ఇంట్లో.. ఎంతో శుభ్రంగా.. రుచిగా చేసినా సరే.. ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకునే వారు పెరిగిపోయారు. పైగా కొన్ని రెస్టారెంట్లు టైమ్ తో సంబంధం లేకుండా 24 గంటలు ఫుడ్‌ డెలివరీ చేస్తుండటంతో.. ఇక బయట ఫుడ్ తినే వారి బాగా పెరిగి పోయారు. అంతేకాక రెస్టారెంట్, పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్లి భోజనాలు చేసే వారికి.. ఇటీవల షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టి అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హోటళ్ల డొల్లతనం బట్టబయలు అవుతోంది.

ఈ ఇష్యూపై పెద్ద సంఖ్యలో నెటినజ్లు స్పందిస్తున్నారు. అలానే కొందరు ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. సినీ నటుడు బ్రహ్మాజీ సైతం ఓ ఫన్నీ ట్వీట్ చేశారు.  అధికారులు దాడులపై టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ చేసి ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. ఫుడ్‌ సెఫ్టీ కమిషనర్‌  చేసిన ట్వీట్‌ను ఉద్దేశించి ఫన్నీగా రిప్లయ్ ఇచ్చారు. ఇలా అయితే మరీ ఎక్కడ తినాలి సార్‌? ఇంట్లోనేనా? అని రిప్లై ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో హోటల్‌ యజమాన్యాల నిర్లక్ష్యానికి  ఫుడ్ లవర్స్ భయపడుతున్నారు. ఇక నుంచి బయట తినాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందని పలువురు పోస్టులు పెడుతున్నారు. మరి..సినీ నటుడు బహ్మాజీ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments