వీడియో: టోల్ ఛార్జ్ లు అడిగితే.. ఏకంగా JCBతో టోల్‌ ప్లాజా ధ్వంసం!

వీడియో: టోల్ ఛార్జ్ లు అడిగితే.. ఏకంగా JCBతో టోల్‌ ప్లాజా ధ్వంసం!

సాధారణంగా జాతీయ రహదారులపై ఎక్కడికైనా ప్రయాణించినప్పుడు టోల్ గేట్ ఛార్జీలను చెల్లించవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వాహనాదారుడుకి టోల్ గేట్ సిబ్బంది ఛార్జీలను చెల్లించమని అడగాగ ఏకంగా ఆ టోల్ బూత్ ను ధ్వంసం చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాధారణంగా జాతీయ రహదారులపై ఎక్కడికైనా ప్రయాణించినప్పుడు టోల్ గేట్ ఛార్జీలను చెల్లించవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వాహనాదారుడుకి టోల్ గేట్ సిబ్బంది ఛార్జీలను చెల్లించమని అడగాగ ఏకంగా ఆ టోల్ బూత్ ను ధ్వంసం చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఎక్కడపడితే అక్కడ టోల్ గేట్స్   అనేవి దర్శనమిస్తూ ఉంటాయి. అయితే ఈ టోల్ గేట్స్   ను  నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా, ప్రైవేటు కాంట్రాక్ట్ కంపెనీలతో కలిసి జాతీయ రహాదారులు, ఎక్స్‌ప్రెస్‌ హైవేల పై నిర్మించాయి. ఇక ఈ టోల్ గేట్స్  వలన రోడ్లు వేయడానికి అయిన ఖర్చును NHAI టోల్‌ రూపంలో వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. జాతీయ రహదారులపై ఎక్కడికైనా  ప్రయాణిస్తున్నప్పుడు.. టూ వీలర్స్ కు మినహాయించి, 3 వీలర్స్, 4 వీలర్స్ వాహనాలకు ఈ టోల్ ఛార్జీలు వసూలు చేస్తారు.

ఇక అక్కడ వాహనం బట్టి టోల్ ఛార్జ్ ను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఆ టోల్ ఛార్జ్ ను వాహనదారుడు కచ్చితంగా చెల్లించవాల్సి ఉంటుంది. కానీ,  తాజాగా  ఓ టోల్ గేట్ వద్ద జరిగిన ఘటనలో ఓ వాహనదారుడు టోల్ గేట్ ఛార్జ్ లు కట్టడానికి బదులు ఏకంగా టోల్ గేట్ నే లేపేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వివరాళ్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లో ఓ వాహనాదారుడు తన దూకుడును ప్రదర్శించాడు. అనగా రాష్ట్రంలోని హపూర్ జిల్లాలో నేడు అనగా మంగళవారం జూన్ 11వ తేదీన ఓ జేసీబీ డ్రైవర్ టోల్ గేట్ వద్ద బీభత్సం సృష్టించాడు. కాగా, . జిల్లాలోని పిల్కువా ప్రాంతం ఛాజార్సి టోల్‌ బూత్‌ వద్ద ఉదయం 8.30 గంటలకు ఓ జేసీబీ వాహనం వచ్చి ఆగింది.

ఈ క్రమంలోనే.. టోల్‌ ప్లాజా సిబ్బంది ఆ జేసీబీ డ్రైవర్ కు టోల్‌ ఛార్జీలు చెల్లించాలని అడిగారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ డ్రైవర్‌.. ఏకంగా తన జేసీబీతో  టోల్‌ ప్లాజాకు చెందిన రెండు బూత్‌లతో పాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడు. ఇక జేసీబీతో టోల్‌ప్లాజా  ధ్వంసం చేస్తుండగా.. అక్కడ  సిబ్బంది ఆ దృశ్యలను వీడియో తీశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జేసీబీ డ్రైవర్‌ను అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరి, టోల్ గేట్ ఛార్జీలు చెల్లించమని అడిగినందుకు ఏకంగా టోల్ గేట్ ను ధ్వంసం చేసిన ఈ  ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments