వీడియో: అర్థరాత్రి రెస్టారెంట్లో లవర్ తో భర్త.. చితకబాదిన భార్య!

వీడియో: అర్థరాత్రి రెస్టారెంట్లో లవర్ తో భర్త.. చితకబాదిన భార్య!

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగాయి. ఈ క్రమంలోనే పరాయి స్త్రీతో భర్త ఉండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుంటున్నారు కొందరు భార్యాలు. అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగాయి. ఈ క్రమంలోనే పరాయి స్త్రీతో భర్త ఉండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుంటున్నారు కొందరు భార్యాలు. అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

నేటికాలంలో దంపతులు మధ్య గొడవలు బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పరాయి వారితో స్నేహాలు, ఇతర విషయాల కారణంగా వీరి మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు భర్తలు భార్యలను పట్టించుకోకుండా…పరాయి మహిళల మోజులో పడుతుంటారు. ఈ క్రమంలోనే భార్యాపిల్లలను నిర్లక్ష్యం చేస్తూ..వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు భార్యలు ..తమ భర్త ఆగడాలను భరిస్తుంటే, మరికొందరు మాత్రం కాళికమాత వారిపై విరుచకపడుతుంది. తాజాగా అర్ధరాత్రి లవర్ తో రెస్టారెంట్ లో ఉన్న భర్తను చూసిన భార్యా ఓ రేంజ్ లో ఉతికారేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో బీడీడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బారాబంకి ప్రాంతంలో  దంపతులు నివాసం ఉంటున్నారు.  కొన్ని రోజులు గా ఆ భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతుండేవి. అతడు వేరే మహిళతో పరిచయం పెంచుకుని, బార్యను నిర్లక్ష్యం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫైజాబాద్ రోడ్డు లో గల ఓ రెస్టారెంట్ వద్ద అర్ధరాత్రి భార్యాభర్త, అతడి ప్రియురాలి మధ్య హైవోల్జేజీ డ్రామా జరిగింది. సదరు వ్యక్తి తన ప్రియురాలితో కలిసి అర్ధరాత్రి సమయంలో భోజనం చేసేందుకు రెస్టారెంట్ కి వచ్చాజడు. అక్కడ కూర్చునే ప్రియురాలితో ముచ్చట్లు చెబుతూ ఉన్నాడు.

ఇక వీరిద్దరు రెస్టారెంట్లో ఉన్న విషయం అతడి భార్య తెలిసింది. దీంతో ఆ వివాహిత..తన సోదరుడితో కలిసి భర్త ఉన్న రెస్టారెంట్ కి వెళ్లింది. తన భర్త వేరే మహిళతో ఉండటం చూసిన ఆమె కాళికా మాతలాగా మారింది. ఆగ్రహంతో ఊగిపోతు..భర్తపై తిట్లదండకం అందుకుంది. అంతేకాక భర్తను, అతడితో ఉన్న ప్రియురాలిని రెస్టారెంట్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చింది.  తమ్ముడి సాయంతో ఇద్దరిని  రోడ్డుపైనే బట్టలు ఉతికినట్లు ఉతికి పారేసింది. భర్తతో ఉన్న మహిళను అయితే రోడ్డుపై పడేసి.. చితకబాదింది. కాలితో తన్నుతూ, జుట్టుపట్టుకుని ఈచ్చుకుంటూ వెళ్తూ..తన ఉగ్ర రూపాన్ని చూపించింది.

చుట్టుపక్కల ఉన్నవారు విడిపించే ప్రయత్నం చేసిన ఆ మహిళ అసలు వదల్లేదు. ఓ రేంజ్ లో భర్తతో ఉన్న మహిళను కొట్టింది. ఇలా గొడవ జరగుతుండగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇరువర్గాలను విడదీసి..అక్కడి నుంచి పంపించారు. అనంతరం ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు కూడా ఇరువర్గాలపై కేసు నమోదు  చేశారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక మహిళ మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Show comments