Crime News- Jogulamba Gadval: అత్తగారింట్లో నిద్రపోతున్న అల్లుడిని రాళ్లతో కొట్టి చంపిన మామ!

అత్తగారింట్లో నిద్రపోతున్న అల్లుడిని రాళ్లతో కొట్టి చంపిన మామ!

Jogulamba Gadwal District Crime News: ప్రస్తుతం సమాజాన్ని కొన్ని వ్యసనాలు, చెడు అలవాట్లు పట్టి పీడిస్తున్నాయి. వాటిలో తాగుడు కూడా ఒకటి. ఆ అలవాటు ఇప్పుడు పచ్చని కాపురాన్ని నాశనం చేసింది.

Jogulamba Gadwal District Crime News: ప్రస్తుతం సమాజాన్ని కొన్ని వ్యసనాలు, చెడు అలవాట్లు పట్టి పీడిస్తున్నాయి. వాటిలో తాగుడు కూడా ఒకటి. ఆ అలవాటు ఇప్పుడు పచ్చని కాపురాన్ని నాశనం చేసింది.

కారణాలు ఏమైనా సరే పచ్చని కాపురాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. డబ్బు, మద్యం, అక్రమ సంబంధాలు ఇలా కారణం ఏదైనా గానీ.. కట్టుకున్న వాళ్లే శిక్షను అనుభవిస్తున్నారు. అర్థంలేని కోపం, మద్యానికి బానిసవ్వడం వంటి కారణాలతో నమ్మి వచ్చిన వాళ్లను నానా ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా అలాంటి ఒక ప్రవర్తనను చూసి తట్టుకోలేని ఒక మామ ఆ అల్లుడిని కడతేర్చాడు. కూతురు కాపురాన్ని చక్కబెట్టలేకపోయానే అనే బాధ కావచ్చు, క్షణికావేశం కావచ్చు హంతకుడిగా మారిపోయాడు.

ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో జరిగింది. అత్తగారింట్లో నిద్రపోతున్న అల్లుడిపై మామ రాళ్లతో దాడి చేశాడు. రాళ్లతో కొట్టి అల్లుడిని పిల్లనిచ్చిన హత్య చేశాడు. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవెల్లి జిల్లా మండల కేంద్రానికి చెందిన మద్దిలేటికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. చిన్నమ్మాయికి ఆరేళ్ల క్రితం వివాహం చేశాడు. మహేశ్వరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలుకు దేవేందర్ కు ఇచ్చి వివాహం చేశారు. అయితే మొదట అంతా బాగానే ఉంది. కానీ, గత రెండు నెలల నుంచే దేవేందర్ ప్రవర్తన బాగా మారిపోయింది. మద్యానికి బానిస అయ్యాడు. గత రెండు నెలల నుంచి మహేశ్వరిని వేధిస్తున్నట్లు తెలిపారు. భర్త వేధింపులు తాళలేక మహేశ్వరి గత కొన్ని రోజులుగా పుట్టింట్లోనే ఉంటోంది. అయితే శనివారం రాత్రి దేవేందర్ అత్తగారింటికి వచ్చాడు.

మళ్లీ శనివారం రాత్రి కూడా మహేశ్వరితో గొడవకు దిగాడు. గొడవ పడి ఇంట్లో నిద్రపోతున్న దేవేందర్ పై మామ దాడికి దిగాడు. అల్లుడిపై రాళ్లతో దాడి చేశాడు. ఆ దాడిలో అల్లుడు దేవేందర్ అక్కడికక్కడే మరణించాడు. అయితే దేవేందర్- మహేశ్వరి దంపతులకు ఇద్దరు పిల్లు ఉన్నారు. దేవేందర్ తల్లి జయమ్మ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంఘటనాస్థలాన్ని డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రవిబాబులు సందర్శించారు. మృతేదాహాన్ని పోస్టుమాట్రం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దేవేందర్ కు ఉన్న ఒక చెడు అలవాటు ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తండ్రి లేకుండా చేసింది. మద్యం సేవించి తన కూతురిని వేధిస్తున్నాడనే కోపంతో మామ.. అల్లుడిని కొట్టి చంపేశాడు. అల్లుడిని మామ కొట్టి చంపడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments