Gold and Silver Rates: పసిడి కొనుగోలుదారులు అలర్ట్.. ఈ ఛాన్స్ మిస్ కావొద్దు!

పసిడి కొనుగోలుదారులు అలర్ట్.. ఈ ఛాన్స్ మిస్ కావొద్దు!

Gold and Silver Rates: ఆకాశమే హద్దుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరల్లో అనూహ్యంగా మార్పులు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Gold and Silver Rates: ఆకాశమే హద్దుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరల్లో అనూహ్యంగా మార్పులు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో బంగారం ధరలు భారీగా తగ్గుతూ వచ్చాయి. మార్చి నెల నుంచి మళ్లీ చుక్కలు చూపిస్తున్నాయి. తగ్గేదే లే అన్నట్టుగా ఆల్ టైమ్ రికార్డు హైక్ కి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగిపోతూ వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్ ల మేలిమి బంగారం ఏకంగా రూ.75 వేల మార్క్ కి చేరుకుంది. ఇక కిలో వెండి రూ.90 వేలకు చేరుకుంది. ఈ క్రమంలోనే కొనుగోలుదారులు బంగారం ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయంలో గత రెండు మూడు రోజులుగా పసిడి ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. ఇదే సమయంలో బంగారం కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు. నేడు మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్.. పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. నిన్న స్థిరంగా కొనసాగిన ధరలు ఈ రోజు కాస్త తగ్గాయి. మన దేశంలో పసిడి, వెండికి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల సీజన్ కావడంతో బంగారం ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూ వచ్చాయి. హైదరాబాద్, వరంగల్ మార్కెట్ లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.74,230 కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.68,040 కి చేరుకుంది.విజయవాడ, విశాఖ పట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.74,230 ఉండగా. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.68,070 వద్ద ట్రెండ్ అవుతుంది. ఆదివారంతో పోలిస్తే వెండి కిలో ధర రూ.100 తగ్గింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర 89,900 వద్ద ట్రెండ్ అవుతుంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,380 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.68,040 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.74,230 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,170 వద్ద కొనసాగుతుంది.ఢిల్లీలో రూ.86,500 గా వద్ద ట్రెండ్ అవుతుంది. ముంబై, కోల్ కతా లో కిలో వెండి ధర రూ.86,400 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.89,900 కు చేరింది. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయో చూడాలి.

Show comments