Gold, Silver Rate On June 13 2024: పసిడి ప్రియులకు ఊహించని షాక్‌.. మళ్లీ పెరిగిన గోల్డ్‌ రేటు

Gold Rate: పసిడి ప్రియులకు ఊహించని షాక్‌.. మళ్లీ పెరిగిన గోల్డ్‌ రేటు

గత కొన్ని రోజులుగా దిగి వస్తోన్న పసిడి ధర.. ఈ రెండు రోజుల నుంచి మాత్రం భారీ షాక్‌ ఇస్తూ వస్తోంది. మరి నేడు గోల్డ్‌ రేటు ఎలా ఉంది అంటే..

గత కొన్ని రోజులుగా దిగి వస్తోన్న పసిడి ధర.. ఈ రెండు రోజుల నుంచి మాత్రం భారీ షాక్‌ ఇస్తూ వస్తోంది. మరి నేడు గోల్డ్‌ రేటు ఎలా ఉంది అంటే..

బంగారం అంటే భారతీయులకు మరీ ముఖ్యంగా మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సందర్భం వచ్చిన ప్రతి సారి ఎంతో కొంత పసిడి కొనుగోలు చేయాలని భావిస్తారు. ఇక వివాహాది శుభకార్యాల వేళ.. బంగారం కొనుగోళ్లు భారీగా ఉంటాయి. అయితే మన దగ్గర పసిడి లభ్యత చాలా తక్కువ. దాంతో మనం విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. ప్రపంచంలో మన దగ్గర ఉన్నంత గోల్డ్‌ ఏ దేశం వద్ద లేదు. ధర ఎంత భారీగా ఉన్నా సరే.. మన దేశంలో బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగవు. ఇక పండగలు, శుభకార్యల వేళ ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. అయితే ధర ఎంత పెరిగినా.. జనాలు కొనడం మాత్రం ఆపడం లేదు. ఇక గత కొన్ని రోజులుగా దిగి వచ్చిన పుత్తడి రేటు.. ఇప్పుడు మళ్లీ భారీ షాక్‌ ఇస్తూ.. పెరిగింది. ఆ వివరాలు..

ఇక గత కొన్ని రోజులుగా దిగి వస్తోన్న బంగారం ధర.. నేడు మాత్రం భారీగానే పెరిగింది. క్రితం సెషన్‌లో కూడా గోల్డ్‌ రేటు పెరగ్గా.. నేడు కూడా అదే బాటలో పయనించింది. ఇక గురువారం నాడు హైదరాబాద్‌ మార్కెట్‌లో పసిడి రేటు పది గ్రాముల మీద 300 రూపాయలు పెరిగింది. క్రితం సెషన్‌లో 150 రూపాయలు పెరగ్గా నేడు అందుకు డబుల్‌ అయ్యింది. ఇక నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్‌ మేలిమి బంగారం పది గ్రాముల ధర 320 రూపాయలు పెరిగింది. దాంతో గురువారం నాడు భాగ్యనగరంలో 24 క్యారెట్‌ గోల్డ్‌ రేటు.. రూ. 72,160కు చేరింది. అలానే ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల ధర 300 రూపాయలు పెరిగింది. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ గోల్డ్ రేటు రూ. 66,150కు చేరింది.

ఇక దేశ రాజాధాని ఢిల్లీలో కూడా బంగారం రేటు భారీగానే పెరిగింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల ధర 300 రూపాయలు పెరిగి.. రూ.66,300కు చేరింది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా భారీగానే పెరిగింది. నేడు స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాముల మీద 320 రూపాయలు పెరిగి.. రూ.72,310 కి చేరింది.

బంగారం బాటలోనే వెండి..

నేడు బంగారం ధర పెరగ్గా.. వెండి రేటు కూడా అదే బాటలో పయనించింది. కిలో వెండి మీద 800 రూపాయలు పెరిగి షాకిచ్చింది. నేడు హైదరాబాద్ మార్కెట్లో బంగారం‌తో పాటు వెండి రేట్లు సైతం పెరుగుతున్నాయి. ఇవాళ కిలో వెండి రేటు రూ.800 మేర పెరిగి రూ. 95,800 కు చేరింది. ఇక ఢిల్లీ మార్కెట్లో కూడా వెండి ధర పెరిగింది. సిల్వర్‌ రేటు కిలో మీద ఇవాళ.. రూ. 800 మేర ఎగబాకి రూ. 91,300ల వద్దకు చేరింది.

Show comments