Today Gold & Silver Rate Dropped: బంగారం కొనాలంటే త్వరపడండి.. ఆ కారణంతో దిగి వస్తోన్న ధర

Gold Rate: బంగారం కొనాలంటే త్వరపడండి.. ఆ కారణంతో దిగి వస్తోన్న ధర

బంగారం కొనాలనుకునే వారికి భారీ శుభవార్త అని చెప్పవచ్చు. నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు దిగి వచ్చింది. ఆ వివరాలు..

బంగారం కొనాలనుకునే వారికి భారీ శుభవార్త అని చెప్పవచ్చు. నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు దిగి వచ్చింది. ఆ వివరాలు..

బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. గత కొన్ని రోజులుగా గోల్డ్‌ రేటులో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా దిగి వచ్చిన ధర.. ఉన్నట్లుండి పెరుగుతుంది. సాధారణంగా మన దేశంలో వివాహాలు, శుభకార్యాల వేళ పసిడి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు మన దేశంలో పెళ్లిల్ల సీజన్‌ కాదు. అలానే దగ్గరలో ఎలాంటి పండగలు కూడా లేవు. దాంతో పసిడి కొనుగోళ్లు మందగించాయి. మరోవైపు అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్‌లో పరిస్థితులు కూడా అందుకు తగ్గట్టుగా ఉండటంతో.. దేశీయల బులియన్‌ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌, సిల్వర్‌ రేటు ఎంత ఉంది అంటే..

క్రితం సెషన్‌లో స్థిరంగా ఉన్న బంగారం ధర నేడు అనగా శనివారం నాడు దిగి వచ్చింది. నేడు హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు 270 రూపాయలు తగ్గింది. దాంతో భాగ్యనగరంలో నేడు 24 క్యారెట్‌ స్వచ్ఛమైన పసిడి రేటు 270 రూపాయలు తగ్గి.. రూ.71,890 కు దిగి వచ్చింది. అలానే 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు కూడా పది గ్రాముల మీద 250 రూపాయలు తగ్గి.. రూ.65,900కు దిగి వచ్చింది. అలానే దేశ రాజధాని ఢిల్లీలో కూడా గోల్డ్‌ రేటు తగ్గింది. నేడు హస్తినలో 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర పది గ్రాముల మీద 250 రూపాయలు తగ్గి.. రూ.72,040 గా ఉంది. అలానే 22 క్యారెట్‌ పసిడి రేటు పది గ్రాముల మీద రూ.270 తగ్గి.. రూ. 66,050 వద్ద అమ్ముడవుతోంది.

బంగారం బాటలోనే వెండి..

ఇక నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర దిగి రాగా.. సిల్వర్‌ కూడా అదే బాటలో పయనించింది. నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో వెండి ధర కిలో మీద 100 రూపాయలు తగ్గింది. నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో వెండి ధర కిలో మీద రూ. 100 తగ్గి 95 వేల రూపాయలకు దిగి వచ్చింది. అలానే దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో సిల్వర్‌ రేటు కేజీ మీద 100 రూపాయలు తగ్గి.. రూ.90,400గా ఉంది. ఢిల్లీ, హైదరాబాద్‌ మార్కెట్‌లో వెండి, బంగారం ధరలు భిన్నంగా ఉంటాయి అందుకు కారణం స్థానికంగా ఉండే పన్నులు.

Show comments