ఆ పని చేయనందుకు..భార్యను కొట్టి చంపిన భర్త!

ఆ పని చేయనందుకు..భార్యను కొట్టి చంపిన భర్త!

జీవితాంతం తోడుగా ఉంటానని అందరిలాగానే ఓ భర్త కూడా తన భాగస్వామికి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు. అయితే పెళ్లినాటి ప్రమాణాలను మంటలతో కలిపేస్తూ ఆ వ్యక్తి దారుణం చేశాడు. ఆమె పాలిట దేవుడు కాకుండా యుముడిగా మారాడు.

జీవితాంతం తోడుగా ఉంటానని అందరిలాగానే ఓ భర్త కూడా తన భాగస్వామికి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు. అయితే పెళ్లినాటి ప్రమాణాలను మంటలతో కలిపేస్తూ ఆ వ్యక్తి దారుణం చేశాడు. ఆమె పాలిట దేవుడు కాకుండా యుముడిగా మారాడు.

పెళ్లి అనే రెండు అక్షరాల పదంతో రెండు వేరు వేరు శరీరాలు ఒకటే మనస్సుగా మారి కలిసిపోతాయి. వేద మంత్రాల సాక్షిగా, భాజాభజంత్రీల నడుమ రెండు మనస్సులు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇలా ఎంతో మంది తమ సంసార జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటారు. అయితే మరికొందరు దంపతులు మాత్రం… చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ..పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటారు. ముఖ్యంగా కొందరు భర్తలు వరకట్నం, అదనపు కట్నం కావాలంటూ భార్యలను హింసిస్తుంటారు. తాజాగా పుత్తడి బొమ్మలాంటి భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు ఓ కసాయి భర్త. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

కర్నాటక రాష్ట్రం రామనగర జిల్లా చెన్నపట్నం తాలుకా మంగడహళ్లి గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అశ్విని(30) అనే మహిళకు మంగడహళ్లి గ్రామానికి చెందిన రమేష్ తో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన చాలా కాలం పాటు ఇద్దరు ఎంతో అనోన్యంగా సంతోషంగా ఉన్నారు. అయితే ఆ తరువాత రమేష్ మనస్సులో ఓ దురుబుద్ది ఏర్పడింది. దీంతో అదనపు కట్నం, ఆస్తి విషయంలో రమేశ్, అశ్వినీల మధ్య గొడవ జరుగుతుండేది. అదనపు కట్నం తేవాలంటూ అశ్వీనిని రమేష్ వేధింపులకు గురి చేసేవాడు. అలానే గొడవలతో వీరి సంసారం సాగుతూ వచ్చింది. అయితే ఇటీవల వీరి మధ్య జరిగే వాగ్వాదం శృతిమించింది. రమేశ్..అశ్వీని పట్ల దారుణంగా ప్రవర్తించాడని సమాచారం. బుధవారం పొలం దగ్గర ఉన్నప్పుడు ఇద్దరి మధ్య మరోసారి గొడవ మొదలైంది.

బుధవారం ఉదయం కొబ్బరితోటలో పని చేస్తుండగా అశ్వినీ, రమేశ్ ల మధ్య గొడవలు జరిగింది. దీంతో భర్త రమేశ్ ఆగ్రహం తీవ్ర స్థాయికి చేరుకుంది. సహనం కోల్పోయిన రమేశ్ ..తన భార్యపై దారుణంగా దాడి చేశాడు. గొడవలో భార్య ఛాతి, తల వంటి భాగాల్లో తీవ్రంగా దాడి చేయడంతో ఆమె కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత నిందితుడైన రమేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. పక్క పొలంలో ఉన్నవారు అశ్విని మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.  స్థానికుల ఇచ్చిన సమాచారంతో అక్కూరు స్టేషన్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి విషయంలో అందమైన కుటుంబాన్ని నాశనం చేసుకున్నారని స్థానికులు అభిప్రాయ పడ్డారు. మృతురాలి తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారుఅలాగే అల్లుడు రమేష్‌పై అక్కురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మొత్తంగా ఇలా ఆస్తులు, అదనపు కట్నం వంటి విషయాల్లో ఎంతో మంది మహిళలు దారుణగా హత్యలకు గురవుతున్నారు. మరి.. ఇలాంటి ఘటనల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments