కర్రలతో దొంగలు దాడి.. ధైర్యంగా ఎదుర్కొన్నతల్లీకూతుళ్లు!

కర్రలతో దొంగలు దాడి.. ధైర్యంగా ఎదుర్కొన్నతల్లీకూతుళ్లు!

ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ద్విచక్ర వాహనాలపై ఒంటరి మహిళలను ఫాలో అవుతూ అదను చూసి వారి మెడలోని గొలుసులు కొట్టేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మహిళలు ధైర్యం ప్రదర్శించి ఆ దుండగులను ఎదిరిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ద్విచక్ర వాహనాలపై ఒంటరి మహిళలను ఫాలో అవుతూ అదను చూసి వారి మెడలోని గొలుసులు కొట్టేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మహిళలు ధైర్యం ప్రదర్శించి ఆ దుండగులను ఎదిరిస్తున్నారు.

నేటికాలంలో అవినీతి మార్గంలో డబ్బులును సంపాదించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా చోరీలు ఘటనలు ఎక్కువయ్యాయి. అలానే చైన్ స్నాచింగ్ ఘటనల సంఖ్య బాగా ఎక్కువైంది. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచర్లు బరితెగిస్తున్నారు. ఇంట్లోని, మహిళ ఒంటిపై ఉన్న నగలను చోరీ చేస్తున్నారు. అడ్డు వచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. అయితే కొందరు మహిళలు మాత్రం ధైర్యంగా దుండగులను ఎదిరించి..వారికే భయం పుట్టేలా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో చైన్ స్నాచర్లను ఓ తల్లీకూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు.  వారిద్దరిపై దాడి జరిగిన ఏమాత్రం భయపడకుండా..దొంగలకు ఎదురు తిరిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ద్విచక్ర వాహనాలపై ఒంటరి మహిళలను ఫాలో అవుతూ అదను చూసి వారి మెడలోని గొలుసులు కొట్టేస్తున్నారు. అయితే చాలా కేసుల్లో నిందితులు పట్టుబడుతున్న.. మరికొన్ని ఘటనల్లో మాత్రం నిందుతులు దొరకడం లేదు. చాలా మంది  మహిళు ఒంటరిగా బయట తిరిగేందుకు భయపడిపోతున్నారు. అలానే ఒంటరి గా ఇళ్లల్లో ఉండేందుకు కూడా జంకుతున్నారు. ఇది ఇలా ఉంటే దొంగలను ధైర్యంగా ఎదిరించి..పారియేలా చేసిన మహిళలు కూడా ఉన్నారు. తమను తాము రక్షించుకునే చర్యలకు కొందరు మహిళలు ధైర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్లకు ఎదురుదెబ్బ తగిలింది. తల్లీకూతుళ్లు తిరగబడటంతో వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని పరారయ్యారు.

హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చోరీ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో కల్పన, లక్ష్మీ ప్రసన్న అనే తల్లీకుమార్తెలు నివాసం ఉంటున్నారు. శుక్రవారం తల్లీకూతుళ్లపై దాడి చేసి దుండగులు మూడున్నర తులాల బంగారు చైన్ ను లాక్కేళ్లారు. ఈ ఘటనలో కల్పనతో పాటు ఆమె కూతురు లక్ష్మీ ప్రసన్నపై కూడా దొంగలు కర్రతో దాడి చేశారు. ఈ సమయంలో దొంగల దాడిని ఎదుర్కొవాలని కల్పన భావించారు. దీంతో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి కల్పన చైన్ స్నాచర్లను ఎదిరించింది. ఈ క్రమంలో కల్పన గాయపడింది.

అలానే కుమార్తె లక్ష్మీ ప్రసన్నకూడ స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక గాయపడిన తల్లీకూతుళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిందుతుల బైక్ నకిలీదని పోలీసులు గుర్తించారు. సీసీ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా తమపై దాడి జరుగుతున్న ఎంతో ధైర్యంగా చైన్ స్నాచర్లను ఎదుర్కొవడం స్థానికులు అభినందిస్తున్నారు. మరి.. ఇలాంటి చైన్ స్నాచింగ్ ఘటనల నివారణకు అధికారులు, పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Show comments