ఆ నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వివాహిత!

ఆ నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వివాహిత!

ఎంతో అభివృద్ధి చెందిన ఆధునిక యుగంలో కూడా మహిళలు వివిధ రకాల వేధింపులకు గురువుతున్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై..దారుణ నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా ఓ వివాహిత అత్తింటి వారు వేసిన నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకుంది.

ఎంతో అభివృద్ధి చెందిన ఆధునిక యుగంలో కూడా మహిళలు వివిధ రకాల వేధింపులకు గురువుతున్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై..దారుణ నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా ఓ వివాహిత అత్తింటి వారు వేసిన నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకుంది.

నిత్యం ఏదో ఒక  ప్రాంతంలో  మహిళలపై వివిధ రకాల వేధింపులు జరుగుతూనే ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన కూడా ఆడవారిపై జరిగే వేధింపులు మాత్రం ఆగడం లేదు. పని చేసే ప్రదేశం, ఇంట్లో, ఇతర ప్రదేశాల్లో నిత్యం వేధింపులకు గురవుతున్నారు. ఈక్రమంలో కొందరు మహిళలు మనస్తాపానికి గురై.. దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా వివాహిత..తనపై అత్తింటి వారు వేసిన నిందలకు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె పిల్లలు అనాథలు కాగా..పుట్టింటి వారు శోక సంద్రంలో మునిగారు. ఈఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు , బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

తెలంగాణ రాష్ట్రం సికింద్రబాద్ ప్రాంతంలోని జవహర్ నగర్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన వనమోజు నాగరాణి(29)కి నేరేడ్ మెట్ జేకే కాలనీలో ఉంటున్న వనమోజు వెంకటాచారి(35)తో వివాహం జరిగింది. వీరి పెళ్లి 2010 ఎంతో ఘనం గా జరిగింది. ఇక వీరి దాంపత్యానికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అయితే వారికి ఆడపిల్లలు పుట్టడంతో అత్తామామ, ఆడ బిడ్డలు నాగరాణిని వేధించారు. అలానే అదనపు కట్నం తేవాలని వారు వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలి బంధువులు తెలిపారు.

ఇద్దరు ఆడ పిల్లలను కన్నావని భర్త, అత్తమామలు, ఆడపడుచులు నిత్యం వేధింపులకు గురి చేశారు. ఇంట్లో డబ్బు కాజేశావంటూ దొంగను చేశారు. ఇలా నిత్యం బాధలు పెట్టిన ఇక బిడ్డల కోసం వారి వేధింపులను భరిస్తూ వచ్చింది. అయితే అత్తింటి వారి వేధింపులు ఎక్కువ కావడంతో ఇక భరించలేక దారుణ నిర్ణయం తీసుకుంది. మార్చి2న నాగరాణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో నాగరాణి పుట్టింట్లో విషాదం నెలకొంది. ఇక మృతురాలి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే బుధవారం నాగరాణి భర్త, అత్తమామలు, ఇద్దరు ఆడపడుచుల్ని బుధవారం అరెస్టు చేశారు. మొత్తంగా వరకట్నం వేధింపులకు మరో మహిళ బలైందని స్థానికు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆధునిక యుగంలో కూడా ఆడపిల్లలు పుట్టారని వేధించే అత్తింటి వారు ఉండటం, సమాజం ఎటువైపు పోతుందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటికాలంలో మగవారితో సమానంగా ఆడవారు అన్ని రంగాల్లో దూసుకెళ్తుంటే.. ఇంకా ఆడబిడ్డపై వివక్ష ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నాగరాణి మాదిరిగా తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఎందరో మహిళలు వేధింపులకు గురవుతున్నారు. అలానే నాగరాణి లాంటి మహిళలు కూడా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొవాలే కానీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి.

Show comments