తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. వారం రోజులుగా ఇదే పరిస్థితి

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. వారం రోజులుగా ఇదే పరిస్థితి

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్‌.. ప్రస్తుతం వేసవికాలం సమ్మార్‌ హాలిడేస్‌ కావడంతో.. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. దీంతో ఆ శ్రీవారిని దర్శించుకునేందుకు ఏకంగా కొండ పై అన్ని గంటల సమయం పడుతుంది.

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్‌.. ప్రస్తుతం వేసవికాలం సమ్మార్‌ హాలిడేస్‌ కావడంతో.. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. దీంతో ఆ శ్రీవారిని దర్శించుకునేందుకు ఏకంగా కొండ పై అన్ని గంటల సమయం పడుతుంది.

దేశంలో అత్యంత ప్రముఖ్యత గల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం.  దీనినే కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. ఎందుకంటే.. స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ పై వెలిసారు. అందుచేతనే ఆయనను కలియుగ ప్రత్యేక్ష్య దైవంగా పిలుస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమలలో కొలువైన ఆ శ్రీనివాసుడుని దర్శించుకోనేటకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా దేశ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో తిరుమల కొండకు తరలివెళ్తుంటారు. అయితే ప్రస్తుతం వేసవికాలం సమ్మార్‌ హాలిడేస్‌ కావడంతో.. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. దీంతో ఆ శ్రీవారిని దర్శించుకునేందుకు ఏకంగా కొండ పై అన్ని గంటల సమయం పడుతుంది.

ముఖ్యంగా గత వారం రోజుల నుంచి అయితే ఆ శ్రీవారిని దర్శించుకునేందుకు  తిరుమల కొండపై  భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. అయితే మంగళ, బుధవారాల్లో కాస్త రద్దీ తగ్గినట్లు కనిపించినా మళ్లీ గురువారం రాత్రి నుంచి భక్తుల తాకిడి ఎక్కువైంది. దీంతో ఆ స్వామివారి దర్శించుకునేందుకు ఏకంగా 20 గంటల నుంచి 24 గంటల సమయం పడుతోంది. ఇక ఈరోజు కూడా తిరుమలలో భక్తులతో రద్దీగా కొనసాగుతోంది. అయితే ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూ లైన్‌లోకి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2 నిండిపోయింది. నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయి రింగురోడ్డులోని బాటగంగమ్మ ఆలయం వరకు భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. పైగా వీకెండ్‌ కావడంతో రద్దీ మళ్లీ పెరుగుతోందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా.. టీటీడీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, అలాగే భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలను అందజేస్తునమని తెలిపింది.

ఇక తిరుమలలో గురువారం రాత్రి కొద్దిసేపు భక్తుల్ని క్యూ లైన్‌లోకి అనుమతించలేదని, పైగా శుక్రవారం ఉదయం రావాలని టీటీడీ అధికారులు వారికి సూచించినట్లు తెలుస‍్తోంది. అయితే తిరుమలలోని మాడ వీధులు భక్తులతో రద్దీగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా అఖిలాండం, లడ్డూల కౌంటర్, అన్నప్రసాద భవనం, లేపాక్సి సర్కిల్.. ఇలా ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం తిరుమలలో ఆ శ్రీవారిని 65వేల 416మంది భక్తులు దర్శించుకున్నారు. అంతేకాకుండా.. శ్రీవారి హుండీకి రూ3కోట్ల 51 లక్షల ఆదాయం సమకూరిందని టీటీడీ తెలిపింది. మరోవైపు ఇవాళ తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. అలాగే మధ్యాహ్నం వసతి గదుల కోటాను విడుదల చేస్తారని తెలిపింది. అయితే, తిరుమల వెళ్లలనుకునే భక్తులు కొండపై ఉన్న రద్దీ దృష్ట్య వెళ్లడం మంచిది. మరి తిరుమలలో శ్రీవారి దర్శనానికి 24 గంట సమయం పట్టడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments