Thummala Nageswara Rao-Rythu Bharosa Scheme: రైతు భరోసా.. ఎకరానికి రూ.15 వేలు.. వారికి మాత్రమే: మత్రి తుమ్మల

Rythu Bharosa: రైతు భరోసా.. ఎకరానికి రూ.15 వేలు.. వారికి మాత్రమే: మత్రి తుమ్మల

రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అన్నదాతలు రైతు భరోసా నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అన్నదాతలు రైతు భరోసా నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఎ‍న్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చే ప్రయత్నంలో ఉంది. మరీ ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలకు కట్టుబడి ఉంది. ఇప్పటికే దీనిలో కొన్ని హామీలను అమలు చేయగా.. మరి కొన్ని హామీల అమలుకు కార్యచరణ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, జీరో కరెంట్‌ బిల్లు, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా, ఆరోగ్య శ్రీ పెంపు వంటి హామీలను నెరవేర్చారు. ఇక మధ్యలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో.. ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. దాంతో కొన్ని హామీల అమలకు అడ్డంగి ఏర్పడింది. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. దాంతో మిగిలిన హామీల అమలుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇక ఎన్నికల హామీల్లో కీలకమైన రైతు భరోసా, రైతు రుణమాఫీ అమలుకై రేవంత్‌ సర్కార్‌ కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఆగస్ట్‌ 15 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో మరో ముఖ్యమై హామీ రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేల సాయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఆ వివారలు.. చ

రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 15 వేల సాయం అందిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే పథకం రైతు బంధు పేరుతో అమలయ్యింది. అప్పుడు కారు సర్కార్‌.. రైతు బంధు కింద ఎకరాకు రూ. 10 వేల సాయం అందించేది. అయితే తాము అధికారంలోకి వస్తే రెండు విడతల్లో రూ. 15 వేల సాయం అందిస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పటికే వానలో జోరుగా కురవడంతో.. అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించారు. వారంతా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.. రైతు భరోసా పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం కింద అర్హులకే పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. త్వరలోనే రైతు సంఘాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుంటామని.. అసెంబ్లీలో చర్చించి.. దీనిపై విధివిధానాలు రూపొందిస్తామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించిందని.. అలానే సాగులో లేని భూములకు కూడా రైతు భరోసా ఇవ్వడంతో.. ఈ పథకం దుర్వినియోగమైందనే భావన ప్రజల్లో ఉంది అన్నారు. తమ పాలనలో అలాంటి అవకతవకలు అవకాశాలు లేకుండా చూసుకుంటామని.. అందుకే సాగు చేసే వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని కాంగ్రెస్‌ సర్కార్‌ భావిస్తోంది అని తెలిపారు తుమ్మల.

రైతుభరోసా పథకం అమలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న తుమ్మల.. పంటల బీమా పథకం సైతం అర్హులకే వర్తించేలా రూపకల్పన చేస్తామన్నారు. బీమా ప్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుందని.. నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందేలా నిబంధనలను సరళతరం చేస్తామన్నారు. రూ.2 లక్షల చొప్పున పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారని తుమ్మల వెల్లడించారు. విడతల వారీగా మాఫీ చేయటం వల్ల ఆ సొమ్ము వడ్డీకే సరిపోతుందనే భావన రైతుల్లో ఉందన్నారు. ఈ అంశంపైనా త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా వెల్లడించారు.

Show comments