iDreamPost

PAN Indian Movies : ఏడాది పొడవునా భారీ సినిమాల పండగ

PAN Indian Movies : ఏడాది పొడవునా భారీ సినిమాల పండగ

కొత్త ఏడాది ప్రారంభమయ్యింది. మొదటి రోజే ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ వార్త మూవీ లవర్స్ కు మనస్థాపం కలిగించినా రాబోయే సంవత్సరం మొత్తం పాన్ ఇండియా సినిమాలతో సౌత్ ఇండస్ట్రీ జాతీయ స్థాయిలో వెలిగిపోవడం మాత్రం ఖాయం. పుష్ప పార్ట్ 1 ది రైజ్ డబ్బింగ్ వెర్షన్ అంత సులువుగా 50 కోట్లను రాబట్టడం చూస్తుంటే నార్త్ ఆడియన్స్ మన మాస్ కంటెంట్ ని ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థమవుతోంది. అందుకే ఇకపై భారీ బడ్జెట్ చిత్రాలన్నీ కూడా హిందీ వెర్షన్ తో కలిపి ఒకేరోజు రిలీజ్ చేసేలా మన నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ సంగతి కాసేపు పక్కనపెట్టి మిగిలినవాటి మీద ఓ లుక్ వేద్దాం.

అడివి శేష్ హీరోగా రూపొందిన మేజర్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. సోనీ సంస్థ మహేష్ బాబు నిర్మాణ భాగస్వాములుగా భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందించారు. ఫిబ్రవరి 11 విడుదల తేదీగా లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. దీనికన్నా ముందు వచ్చే ఆచార్య సైతం ఇదే బాట పట్టనుంది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ రామ్ చరణ్ ఇమేజ్ ని బాగా పెంచేసింది. ఇది ఇప్పుడు మెగా మూవీకి ఉపయోగపడనుంది. దర్శకుడు కొరటాల శివ ప్రెజెంట్ చేసిన కంటెంట్ కనక కరెక్ట్ గా కనెక్ట్ అయితే పుష్పను దాటడం పెద్ద కష్టమేమి కాదు. రవితేజ ఖిలాడీని సైతం హిందీలో వదిలే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని వినికిడి.

ప్రభాస్ ఆది పురుష్ ఎలాగూ మల్టీ లాంగ్వేజ్ మూవీ కాబట్టి ఎన్ని వేల కోట్లు టార్గెట్ గా పెట్టుకుంటుందో చెప్పలేం. సలార్ ఈ ఏడాది రావడం అనుమానమే. ఆకాశమే హద్దుగా అంచనాలు మోస్తున్న కెజిఎఫ్ 2 కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఏప్రిల్ 14 దాకా ఆగాలి. మహేష్ బాబు సర్కారు వారి పాటను నిశ్చింతగా ఇతర భాషల్లోకి తీసుకెళ్లొచ్చు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఎప్పుడొచ్చినా నార్త్ లోనూ రికార్డుల మోత ఖాయం. కమల్ హాసన్ విక్రమ్ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా హైప్ పెరగడానికి ఎక్కువ సమయం పట్టదు. బాలీవుడ్ సైతం బ్రహ్మాస్త్ర, రామ్ సేతు, లాల్ సింగ్ చద్దా, పఠాన్ లాంటి వాటితో డబ్బింగులను కొట్టి సౌత్ మార్కెట్ ని టార్గెట్ చేస్తోంది.

Also Read : Kajal Aggarwal : తల్లి కాబోతున్న కాజల్.. గుడ్ న్యూస్ చెప్పిన భర్త

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి