This Week OTT Movies: ఈ వారంలో OTTలోకి రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లివే..

ఈ వారంలో OTTలోకి రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లివే..

This Week Ott Movies ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఓటీటీలో కొన్ని మూవీ అలరించేందుకు వచ్చేస్తున్నాయి. అయితే ఈ ప్రేక్షకులకు మాత్రం కాస్త నిరాశే. ఇంతకు ఎన్ని సినిమాలు, ఏ OTTల్లోకి రాబోతున్నాయంటే...?

This Week Ott Movies ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఓటీటీలో కొన్ని మూవీ అలరించేందుకు వచ్చేస్తున్నాయి. అయితే ఈ ప్రేక్షకులకు మాత్రం కాస్త నిరాశే. ఇంతకు ఎన్ని సినిమాలు, ఏ OTTల్లోకి రాబోతున్నాయంటే...?

ప్రతి వారంలాగానే.. ఈ వారం కూడా థియేటర్లలో కొన్ని సినిమాలు సందడి చేయబోతున్నాయి. విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి, కార్తీకేయ భజేవాయు వేగంతో పాటు ఆనంద్ దేవరకొండ గం గం గణేశా చిత్రాలు సందడి చేయబోతున్నాయి. వీటిల్లో ఏదీ హిట్ లేక ఫట్ అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, వీటితో పాటు కొన్ని ఓటీటీ మూవీస్ కూడా సినీ లవర్స్ ను పలకరించనున్నాయి. తెలుగు కన్నా హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు మాత్రమే షురూ చేయనున్నాయి. ఈ వారం తెలుగు సినిమాలకు సంబంధించిన సమాచారం లేదు. అయితే గురువారం, బుధవారం సమయానికి అప్ డేట్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వారం మొత్తంగా 19 వెబ్ సిరీస్, సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

ఇందులో చాలామంది ఇంట్రస్టింగ్‌గా ఎదురు చూస్తున్న మూవీ వీర్ సావర్కర్. ఈ సినిమా కోసం కొన్ని వర్గాలు ఈగర్లీ వెయిట్ చేస్తున్నాయి. అలాగే ఈ వారంలో ఓటీటీలో విడుదలయ్యే తెలుగు మూవీస్ గురించి ఎటువంటి అప్డేట్ లేదు. కాగా, బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. మే 27 నుండి జూన్ 2 వరకు వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజయ్యే మూవీస్ వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తంగా 19 సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. అవేంటే.. ఓ సారి లుక్కేద్దాం.

అమెజాన్ ప్రైమ్..

పంచాయత్ సీజన్ 3 (హిందీ సిరీస్)- మే 28

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది లైఫ్ యూ వాంటెడ్ (ఇటాలియన్ వెబ్ సిరీస్)- మే 29

గీక్ గర్ల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 30

ఎరిక్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 30

ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ మూవీ)- మే 31

రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ వెబ్ సిరీస్)- మే 31

లంబర్ జాక్ ది మాన్‌స్టర్ (జపనీస్ చిత్రం)- జూన్ 1

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

కామ్డేన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 29

ది ఫస్ట్ ఒమన్ (ఇంగ్లీష్ హారర్ మూవీ)- మే 30

ఉప్పు పులి కారమ్ (తమిళ వెబ్ సిరీస్)- మే 30

జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 31

జియో సినిమా ఓటీటీ

ఇల్లీగల్ సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్)- మే 29

దేద్ బిగా జమీన్ (హిందీ మూవీ)- మే 31

లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 31

ది లాస్ట్ రెఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 31

ఏలీన్ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 1

జీ5 ఓటీటీ
స్వాతంత్య్ర వీర్ సావర్కర్ (హిందీ చిత్రం)- మే 28

హౌజ్ ఆఫ్ లైస్ (హిందీ వెబ్ సిరీస్)- మే 31

సైనా ప్లే ఓటీటీ

పొంబలై ఒరుమై (మలయాళ చిత్రం)- మే 31

Show comments