Huge Returns: 3 నెలల్లోపే 4 లక్షలకు పైగా లాభం తెచ్చిపెట్టిన స్థలాలు.. ఎక్కడంటే?

3 నెలల్లోపే 4 లక్షలకు పైగా లాభం తెచ్చిపెట్టిన స్థలాలు.. ఎక్కడంటే?

Huge Returns: స్థలం మీద పెట్టుబడి పెట్టిన మూడు నెలల్లో 4 లక్షలు ఎవరికైనా లాభం వస్తుందా? కానీ ఈ ఏరియాలో పెట్టుబడి పెట్టిన వారికి సుమారు 5 లక్షల లాభం వచ్చింది. 6 నెలల ముందు పెట్టుబడి పెట్టిన వారికి 10 లక్షలు లాభం వచ్చింది. ఆ ఏరియా ఎక్కడంటే?

Huge Returns: స్థలం మీద పెట్టుబడి పెట్టిన మూడు నెలల్లో 4 లక్షలు ఎవరికైనా లాభం వస్తుందా? కానీ ఈ ఏరియాలో పెట్టుబడి పెట్టిన వారికి సుమారు 5 లక్షల లాభం వచ్చింది. 6 నెలల ముందు పెట్టుబడి పెట్టిన వారికి 10 లక్షలు లాభం వచ్చింది. ఆ ఏరియా ఎక్కడంటే?

ప్రభుత్వం మారిన తర్వాత, మొన్న వచ్చిన లోక్ సభ ఫలితాల తర్వాత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నెమ్మదించిందని వార్తలు వచ్చాయి. కొన్నిచోట్ల ప్రాపర్టీ రేట్లు తగ్గాయి కానీ కొన్ని చోట్ల మాత్రం ఈ మార్పులేవీ కూడా ప్రతికూల ప్రభావం చూపలేకపోయాయి. 2024 జనవరి నుంచి మార్చి నెల మధ్య ఎవరైతే ఆ ఏరియాలో స్థలాలు కొన్నారో ఆ ఏరియాలో రేట్లు భారీగా పెరిగాయి. అతి తక్కువ సమయంలోనే సుమారు 5 లక్షల రూపాయలు లాభం తెచ్చిపెట్టింది. 2024 జనవరి నెల ముందు అంటే స్థలం మీద పెట్టుబడి పెట్టిన వారికి సుమారు 10 లక్షలు లాభం తెచ్చిపెట్టింది. ఏడాదిలో 12.5 శాతం పెరిగింది. వాస్తవానికి ఈ రేంజ్ లాభాలు రావాలంటే కనీసం రెండేళ్లు ఎదురుచూడాలి. కానీ ఈ ఏరియాలో పెట్టుబడి పెట్టిన వారు మాత్రం 3 నెలల్లోనే భారీ రిటర్న్స్ చూశారు. 

బెంగళూరు హైవేపై షాద్ నగర్ పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ప్రస్తుతం ఇక్కడ స్థలాల మీద డిమాండ్ పెరిగింది. షాద్ నగర్ చుట్టూ ఒక పోలేపల్లి సెజ్, మూడు ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. షాద్ నగర్ దగ్గరలో ఇండస్ట్రియల్ ఏరియాలుగా ఉన్న కొత్తూరు, నందిగామ గ్రామాలు ఉన్నాయి. అలానే దగ్గరలో బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. దీనికి తోడు అమెజాన్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్, ఎంఎస్ఎన్ ఫార్మా, నాట్కో ఫార్మా, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వంటి కంపెనీలు ఉన్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టుకి 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకునేంత దగ్గరలో షాద్ నగర్ ఉండడం ప్లస్ పాయింట్. అవుటర్ రింగ్ రోడ్ కి కూడా 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకునేంత దగ్గరగా షాద్ నగర్ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ అయితే నడిచి వెళ్లేంత దూరంలో ఉంది.

ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే ఇప్పుడు అందరి దృష్టి ఈ షాద్ నగర్ పై పడింది. 2 నెలల క్రితం షాద్ నగర్ లో చదరపు అడుగు స్థలం రూ. 1550 ఉండగా.. ఇప్పుడది రూ. 1800 అయ్యింది. అంటే గజం రూ. 13,950 ఉన్న స్థలం ఈ మూడు నెలల్లో 16,200 అయ్యింది. అంటే గజం మీద 2,250 లాభం వచ్చినట్టు. మూడు నెలల క్రితం గజం రూ. 1550 చొప్పున 200 గజాల స్థలాన్ని 27,90,000 కొన్నవారికి ఇప్పుడు 32,40,000 వచ్చినట్టు. అంటే ఈ మూడు నెలల్లోనే 4,50,000 లాభం వచ్చినట్టు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. షాద్ నగర్ లో రియల్ ఎస్టేట్ ఎంత వేగంగా పెరుగుతుందో అని. ఇక 2023లో గజం 11,700 ఉండేది. అప్పుడు 23,40,000 వేలకు 200 గజాలు కొన్నవారికి ఇప్పుడు 9 లక్షలు లాభం వచ్చింది. ఈ లెక్కల్లో లాభాలు అటూ, ఇటుగా ఉండచ్చు. కానీ లాభం మాత్రం వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి.     

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

Show comments