Rain Alert In AP: AP ప్రజలకు హెచ్చరిక.. ఆ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం!

AP ప్రజలకు హెచ్చరిక.. ఆ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం!

Rain Alert In AP: ఏపీ వాసులకు కీలక రెయిన్ అలెర్ట్ వచ్చింది. రానున్న రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివరాలు..

Rain Alert In AP: ఏపీ వాసులకు కీలక రెయిన్ అలెర్ట్ వచ్చింది. రానున్న రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివరాలు..

గత కొన్ని రోజుల వరకు  రెండు తెలుగు రాష్ట్రాలు అగ్నిగోళాల మండిపోయాయి. తీవ్రమైన వేడిని భరించలేక ఉక్కపోతతో సామాన్య ప్రజలు అల్లాడిపోయారు. ఇక ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ లు లేకపోతే ఒక్క క్షణం కూడ ఇంట్లో ఉండలేని పరిస్థితి జరగింది. అయితే కొన్ని రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతూ వచ్చాయి. అంతేకాక తెలుగు రాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వానలు కురిశాయి. అలానే ఇటీవల కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయన రాష్ట్రాల వాతావరణ  శాఖలు కీలక అప్ డేట్స్ ఇస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు.. ఆంధ్రప్రదేశ్‌ వాసులకు అలర్ట్‌ జారీ చేశారు. ఆ జిల్లాలో ఉరుములు,మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉంది. మ

ఏపీలోని రేపు ఎల్లుండి తెలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. అలానే ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే ఛాన్స్ ఉంది. పలు జిల్లాలో  ఉరుములతో కూడిన వానతో పాటు30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు మంగళవారం  ఉత్తర అరేబియా సముద్రం మీదుగా మహారాష్ట్ర, తెలంగాణాలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రాబోయే  రెండు రోజుల్లో గంటల్లో నైరుతి రుతుపవనాలు తెలంగా, ఏపీ, ఛత్తీస్‌గఢ్‌లోని మరికొన్ని ప్రాంతాల మీదుగా వెళ్లే అవకాశం ఉందని తెలిపింది.

ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశంఉంది. అదే విధంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. 30 నుంచి 40 కిమీ వేగంతో  ఈదురు గాలు వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వానలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో సంభవించే అవకాశముంది. ఇక్కడ కూడా ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

రేపు ఎల్లుండి విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానాలు కురిసే అవకాశం ఉన్నందున్న ఆయా ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షంలో బయటకు వెళ్లకూడదని.. ఒకవేళ అత్యవసరమై వెళ్లాల్సి వస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపు , ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నందున.. ప్రజలు ఎవరూ చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Show comments