మంజుముల్ బాయ్స్ లాంటి స్నేహితులు బయట కష్టం! ఈ ఘటనే ఉదాహరణ!

మంజుముల్ బాయ్స్ లాంటి స్నేహితులు బయట కష్టం! ఈ ఘటనే ఉదాహరణ!

నేటికాలంలో కొందరు యువత ప్రవర్తించే తీరు దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా మద్యం మత్తులో, రీల్స్ పిచ్చిలో వారు చేసే పనులు పరాకాష్టంగా ఉంటున్నాయి. మూడు రోజుల క్రితం ఓ యువకుడు రీల్స్ పిచ్చితో 100 అడుగుల నీటి క్వారీలోకి దూకి మృతి చెందాడు. తాజాగా మరో యువకుడు నదిలో దూకాడు.

నేటికాలంలో కొందరు యువత ప్రవర్తించే తీరు దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా మద్యం మత్తులో, రీల్స్ పిచ్చిలో వారు చేసే పనులు పరాకాష్టంగా ఉంటున్నాయి. మూడు రోజుల క్రితం ఓ యువకుడు రీల్స్ పిచ్చితో 100 అడుగుల నీటి క్వారీలోకి దూకి మృతి చెందాడు. తాజాగా మరో యువకుడు నదిలో దూకాడు.

ఇటీవల విడుదలైన మంజుమ్మల్ బాయ్స్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో స్నేహం గురించి దర్శకుడు చక్కగా చూపించాడు. ఒక గ్రామానికి చెందిన కొందరు స్నేహితులు ఓ గుహవైపు వెళ్తారు..అక్కడ వారిలోని సుభాష్ అనే స్నేహితుడు.. అనుకోకుండా గుహలోప పడిపోతాడు. దీంతో మిగిలిన స్నేహితులు తమ ప్రాణాలకు తెగించి…సుభాష్ ను కాపాడతారు. ఇక తమ స్నేహితుడిని కాపాడేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇది సినిమా.. నిజ జీవితంలో ఇలాంటి స్నేహితులు దొరకడం చాలా కష్టం. అంత స్వార్థంతో కూడిన వ్యక్తులే, అవకాశం కోసం చేసే స్నేహాలే తప్ప నిజమైన ఫ్రెండ్స్ తక్కువగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే..ప్రాణాలు కాపాడాల్సిన స్నేహితులే ప్రాణాలు తీస్తున్నారు. అందుకు ఉదాహరణే తాజాగా జరిగిన  ఓ ఘటన. కళ్ల ముందు స్నేహితుడు ప్రాణాలు పోతుంటే.. చూస్తూనే ఉన్నారు కానీ..కాపాడే ప్రయత్నం చేయలేదు.

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణ గుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు ఉన్నారు. వీరు  కర్ణాటక రాష్ట్రంలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతానికి టూర్ కి వెళ్లారు. ఈ క్రమంలో ఫుల్లుగా మద్యం తాగారు. ఆ మత్తులోనే నలుగురు స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. తాగిన మైకంలో ఫ్రెండ్స్ సాజిద్ అనే యువకుడికి ఛాలెంజ్ చేశారు. ఇక ఫ్రెండ్స్ రెచ్చగొట్టడంతో సాజిద్ ఒక్కసారిగా నదిలోకి దూకేశాడు. అతడికి పూర్తి స్థాయిలో ఈత రాదు. దీంతో నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయాడు. ఇది ఇలా ఉంటే సాజిద్ నీటిలో మునిగిపోతుంటే..కాపాడాల్సింది పోయి… అతడి ఫ్రెండ్స్ వీడియోలు  తీస్తూ తెగ ఎంజాయ్ చేశారు. చివరకు ఆ యువకుడు మృతి చెందగా… ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కర్ణాటకలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతంలో తాగిన మైకంలో ఫ్రెండ్స్ రెచ్చగొట్టడంతో సాజిద్ నదిలోకి దూకి ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సాజిద్ మృతదేహం హైదరాబాద్ పాతబస్తికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు అతను ఎలా చనిపోయాడు అక్కడ ఏం జరిగిందో అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇక ఈ నలుగురు వ్యక్తుల గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన సాజిద్, గోటి, అఫు గోమా, తాజుద్దీన్ అనే నలుగురు వ్యక్తులు ఆటోలు నడుపుతుంటారు. వీళ్లు అప్పుడప్పుడు గంజాయి కూడా అమ్ముతుండేవారని స్థానికులు చెబుతున్నారు. మొత్తంగా మద్యం మత్తులో చేసే పనుల కారణంగా ఎన్నో కుటుంబాల్లో విషాదాలు అలుముకుంటున్నాయి.

Show comments