TSRTC పేరు మార్పు.. కొత్త పేరు ఏమిటంటే?

TSRTC పేరు మార్పు.. కొత్త పేరు ఏమిటంటే?

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) పేరు అధికారికంగా మార్చింది. టీఎస్ ఆర్టీసీ కొత్త పేరు ఏంటంటే?

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) పేరు అధికారికంగా మార్చింది. టీఎస్ ఆర్టీసీ కొత్త పేరు ఏంటంటే?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. రేవంత్ సర్కార్ ఎన్నికల సందర్బంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తోంది. మహిళలకు మహాలక్ష్మీ పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అవసరమైన కొత్త బస్సులను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరులో కీలక మార్పు చేసింది. టీఎస్ఆర్టీసీ పేరు మార్చుతూ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. టీఎస్ ఆర్టీసీ పేరును ఇకపై అలా మారనుంది. ఇంతకీ కొత్త పేరు ఏంటంటే?

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) పేరు అధికారికంగా మారింది. తాజాగా టీఎస్ ఆర్టీసీ పేరును టీజీఎస్ ఆర్టీసీగా మార్చింది ప్రభుత్వం. దీంతో ఇక నుంచి ఆర్టీసీ బస్సులపై టీఎస్ ఆర్టీసీ స్థానంలో టీజీఎస్ ఆర్టీసీ కనిపించనుంది. పేరు మార్పు విషయాన్ని అధికారులు ధృవీకరించారు. త్వరలో లోగోలో మార్పులు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ షార్ట్ కట్ నేమ్‌ను టీఎస్‌గా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ సంక్షిప్త పదం టీఎస్‌ అబ్రియేషన్‌ను టీజీగా మార్చాలని ఇటీవల రేవంత్ సర్కార్ అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విభాగాలను ఆదేశించిన విషయం తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్‌ఆర్టీసీ పేరును టీజీఎస్‌ఆర్టీసీగా మార్చడం జరిగిందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆ మేరకు అధికారిక ఎక్స్‌ ఖాతాలైన @tgsrtcmdoffice, @tgsrtchqలను సంస్థ మార్చింది. మీ విలువైన సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను సంస్థ కోరుతోందని తెలిపారు. #TGSRTC అందిస్తోన్న సేవల గురించి తెలుసుకునేందుకు @tgsrtcmdoffice, @tgsrtchq ఖాతాలను ఫాలో అవ్వాలని విజ్ఞప్తి చేస్తోందని రాసుకొచ్చారు.

Show comments