దేశమంతటా నిరసనలతో దిగొచ్చిన కోర్టు.. నిందితులకు బెయిల్ రద్దు!

దేశమంతటా నిరసనలతో దిగొచ్చిన కోర్టు.. నిందితులకు బెయిల్ రద్దు!

గత రెండు రోజుల క్రితం మహారాష్ట్ర పుణెలోని ఇద్దరు ఐటీ ఉద్యోగులను ఓ మైనర్‌ బాలుడు అతి వేగంగా కారుతో ఢీ కొట్టడంతో.. అక్కడికక్కడే వారు మరణించిన విషయం తెలిసిందే. అయితే వారి మరణానికి కారణమైన నిందుతుడి బెయిల్‌ పై దేశ వ్యాప్తంగా నిరసనలు జరగడంతో దిగివచ్చిన కోర్టు బెయిల్‌ ను రద్దు చేసింది.

గత రెండు రోజుల క్రితం మహారాష్ట్ర పుణెలోని ఇద్దరు ఐటీ ఉద్యోగులను ఓ మైనర్‌ బాలుడు అతి వేగంగా కారుతో ఢీ కొట్టడంతో.. అక్కడికక్కడే వారు మరణించిన విషయం తెలిసిందే. అయితే వారి మరణానికి కారణమైన నిందుతుడి బెయిల్‌ పై దేశ వ్యాప్తంగా నిరసనలు జరగడంతో దిగివచ్చిన కోర్టు బెయిల్‌ ను రద్దు చేసింది.

గత రెండు రోజుల క్రితం మహారాష్ట్ర పుణెలోని  ఆదివారం తెల్లవారుజామున  3.15 గంటలకు  ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో ఇద్దరు టెకీలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆదివారం అర్ధరాత్రి మైనర్ బాలుడు పీకలదాక మద్యం తాగి అనంతరం అత్యంత వేగంగా పోర్షే కారును నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే.. మహారాష్ట్రకు చెందిన 24ఏళ్ల అనీష్ అవధియా, అశ్విని కోష్ట అనే ఇద్దరు ఐటీ నిపుణలు బైకు పై వెళ్తుండగా.. కళ్యాణి నగర్ ప్రాంతంలోని కారు అతి వేగంగా కారు వీరి బైకు కు ఢీ కొట్టింది. దీంతో 20 అడుగుల ఎత్తులో ఎగిరిపడిన వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే అతివేగంగా మైనర్‌ బాలుడు బైక్‌ ను ఢీ కొట్టడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అయితే వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న  పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ధర్మాసనం యాక్సిడెంట్‌కు కారణమైన బాలుడికి బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా.. రోడ్డుప్రమాదాలపై వ్యాసం రాసుకుని రమ్మని చెప్పింది. వ్యక్తిగత బాండ్, రవాణా కార్యాలయాన్ని సందర్శించి అన్ని నియమాలు, నిబంధనలు అధ్యయనం చేసి ప్రజెంటేషన్ ఇవ్వాలని తెలిపింది. మానసిక వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఇక ఈ తీర్పు పై దేశ వ్యాప్తంగా ఆగ్రహాన్ని తెప్పింది.

కాగా, ఇద‍్దరు ఐటీ నిపుణల మృతికి కారణమైన బాలుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేయడం పై ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా.. మహారాష్ట్రలోని బాధిత కుటుంబాలు, ప్రజలు నుంచి ఆందోళనలు వ్యక్తం చేయడంతో న్యాయస్థానం దిగొచ్చింది. దీంతో మైనర్ బాలుడికి మంజూరు చేసిన బెయిల్‌ను జువైనల్ జస్టిస్ బోర్డు రద్దు చేసింది. బాలనేరస్థుడిని జూన్ 5 వరకు రిమాండ్ హోమ్‌కు పంపింది. అతడిని వయోజనుడిగా విచారించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోలేదు.

అంతేకాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ కూడా ఈ తీర్పును తప్పుపట్టారు.అలాగే నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఇక  పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం కోర్టు తీర్పు పై  నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక మొత్తానికి నిరసనలకు దిగి వచ్చిన కోర్టు నిందుతుడి బెయిల్‌ ను రద్దు చేసింది. మరి ఇద్దరు టెక్కీల మృతికి కారణమైన మైనర్ బాలుడి బెయిల్‌ను కోర్టు రద్దు చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments