Diabetes Woman: దారుణం: షుగర్ వ్యాధి ఉందని మహిళ జాబ్ తొలగించిన బాస్!

దారుణం: షుగర్ వ్యాధి ఉందని మహిళ జాబ్ తొలగించిన బాస్!

Diabetes Woman: చాలా మంది షుగర్ వ్యాధి వచ్చిందని తెలియగానే కుమిలిపోతారు. అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న ఓ మహిళకు మరో ఊహించని చేదు అనుభవం ఎదురైంది.

Diabetes Woman: చాలా మంది షుగర్ వ్యాధి వచ్చిందని తెలియగానే కుమిలిపోతారు. అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న ఓ మహిళకు మరో ఊహించని చేదు అనుభవం ఎదురైంది.

నేటికాలంలో ఘగర్ వ్యాధి అనేది కామన్ అయ్యింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధి అయినా  డయాబెటిస్ ను కంట్రోల్ చేసేందుకు ఎన్నో రకాల చికిత్సలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మధుమేహం అనేది చాలా తక్కువ మందికే ఉండేది. కానీ కాలంలో మార్పులు, తినే తిండే, జీవన శైలీలో జరుగుతున్న మార్పుల కారణంగా చాలా మంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. చాలా మంది షుగర్ వ్యాధి వచ్చిందని తెలియగానే కుమిలిపోతారు. అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న ఓ మహిళకు మరో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. షుగర్ వ్యాధి ఆమె జీవితాన్నే కాకుండా ఉద్యోగం పోయేలా చేసింది. అనుభవం ఎదురైంది. ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి.. అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఎంతో మంది మహిళలు ఉద్యోగాలు చేస్తుంటారు. వారు పని చేసే కొన్ని సంస్థలో పలు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇక తాము ఎదుర్కొంటున్న సమస్యలపై కొందరు మహిళలు పోరాడుతుంటారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటారు. అలానే ఓ మహిళా ఉద్యోగి తనకు జరిగిన అన్యాయం గురించి రెడిట్ అనే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఓ పెద్ద పోస్ట్ పెట్టింది. ఇక ఆమె పెట్టిన పోస్టుప్రకారం.. ఆ మహిళ ఆఫీస్‌లో పనిచేస్తూ ఉండగా.. ఒక్కసారిగా శరీరంలో షుగర్ లెవల్స్ భారీగా పెరిగిపోయాయి. సదరు మహిళకు కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడంతో వెంటనే తన పై అధికారికి చెప్పి.. ఇంటికి వెళ్లింది.

 

 ఇదే సమయంలో ఆఫీస్‌కు వచ్చిన బాస్.. సదరు మహిళ లేకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సందేశం పంపాడు. అయితే బాస్ కు జరిగిన విషయాన్ని సదరు మహిళ చెప్పింది. కావాలంటే డాక్టర్ వద్దకు వెళ్లినట్లు షుగర్ లెవల్స్‌కు సంబంధించిన రిపోర్ట్స్ పంపిస్తానని పేర్కొంది. అయితే ఆ మహిళ మాటలను ఆ బాస్.. ఆమెను అప్పటికప్పుడు జాబ్ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నాడు. అంతటితో ఆగకుండా ఆఫీస్‌లో ఆ మహిళకు సంబంధించిన ఉన్న వస్తువులన్నింటినీ ఆమె ఇంటికే పంపించేశాడు.

ఇక ఈ విషయాన్ని ఆ బాధిత మహిళ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. ఇలాంటి వార్తలను చాలా మంది నమ్మరని, తన బాస్‌తో జరిగిన చాటింగ్‌ను కూడా షేర్ చేసింది. దీంతో ఆ మహిళ పని చేసే సంస్థకు సంబంధించిన బాస్‌పై నెటిజన్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నవారిని అలా ఉద్యోగంలో నుంచి తొలగించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని బాధితి మహిళకు సలహాలు ఇస్తున్నారు.

Show comments