iDreamPost

‘వారసుడు’కి నిజంగా అంత సీనుందా..?

‘వారసుడు’కి నిజంగా అంత సీనుందా..?

తమిళ హీరోలు తెలుగు మార్కెట్ మీద కన్నేయడం కొత్తేమి కాదు. ఒకప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ లకు మన స్టార్లకు ధీటుగా ఓపెనింగ్స్ వచ్చేవి. రోబో రిలీజ్ అనౌన్స్ చేసినప్పుడు టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ ఏవీ దానితో నేరుగా క్లాష్ అయ్యే సాహసాన్ని చేయలేకపోయాయి. భారతీయుడు తర్వాత కమల్ కు, అపరిచితుడు తర్వాత విక్రమ్ కు, గజినీ తర్వాత సూర్యకు ఇక్కడ అశేషమైన మార్కెట్ దక్కింది. వరస ఫ్లాపులతో దాన్ని వాళ్లే తగ్గించుకున్నారు. విజయ్ కోలీవుడ్ లో ఎప్పటి నుంచో స్టార్ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ మాత్రం బలమైన జెండా పాతలేకపోయాడు. తుపాకీ హిట్టయ్యాకే మెల్లగా తన డబ్బింగుల జోరుని పెంచేశాడు.

రీల్ వారసుడి చేతిలో రియల్ 'వారసుడు'..! నెట్టింట ఫొటో వైరల్ -  TeluguBulletin.com

అదిరింది, విజిల్, మాస్టర్ లు మరీ అద్భుత విజయాలు కాదు కానీ కమర్షియల్ గా ఇక్కడి బిజినెస్ లెక్కల్లో సేఫ్ కావడంతో క్రమంగా ఇక్కడ పట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అందులో భాగంగానే దర్శకుడిగా వంశీ పైడిపల్లికి నిర్మాతగా దిల్ రాజుకు వారసుడు రూపంలో అవకాశం ఇవ్వడం. ఈ ప్రొడక్షన్ లో భాగస్వామ్యులు లేరు. అయితే గత కొద్దిరోజులుగా దీని బిజినెస్ ఫిగర్స్ మీద వస్తున్న వార్తలు షాక్ కలిగిస్తున్నాయి. వందల కోట్లతో థియేట్రికల్ డీల్స్ అవుతున్నాయని, ఓవర్సీస్ లో విక్రమ్ పీఎస్ 1లను మించి అమ్ముడుపోయిందనే వార్తలు బాగా హల్చల్ చేస్తున్నాయి. వారసుడు గ్రాఫిక్స్ తో తీసిన గ్రాండియర్ కాదు. ఒక కమర్షియల్ మూవీ అంతే.

New Release Date Announced For Vijay's Next Thalapathy66

ప్రచారంలోకి వచ్చిన టాక్ ప్రకారం థియేటర్ 70 కోట్లు, ప్రైమ్ ఓటిటి 60 కోట్లు, ఆడియో హక్కులు 10 కోట్లు, ఓవర్సీస్ 38 కోట్లు, హిందీ డబ్బింగ్ 32 కోట్లు, కేరళ కర్ణాటక 16 కోట్లు, శాటిలైట్ ఇతరత్రా 60 కోట్లు మొత్తం ఒక్క తమిళ వెర్షన్ నుంచే 280 కోట్ల ప్రీ రిలీజ్ జరిగిందనేది వాటి సారాంశం. ఇంత మొత్తం కావడం అంటే అంత ఈజీ కాదు. కేవలం బజ్ పెంచడానికే ఫిగర్స్ ని ఓవర్ హైప్ చేస్తున్నారన్న కామెంట్స్ లేకపోలేదు. ఎంత విజయ్ కు ఇమేజ్ ఉన్నా మరీ ఈ స్థాయిలో నెంబర్లు కష్టమంటున్నారు. తెలుగులో విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో చిరంజీవి, బాలయ్యలతో సంక్రాంతి రేస్ లో తలపడటం విజయ్ కు అంత ఈజీగా ఉండదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి