Swetha
సాధారణంగా ఉద్యోగం చేసే వారు ఎవరైనా ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి స్విచ్ అవ్వడం అనేది సహజం. కానీ, ఓ చోట కొందరు యువతీ యువకులు ఇలా ఓ కంపెనీలో ఉద్యోగాన్ని మానేసి.. మరో కంపెనీకి వెళ్లినందుకు ఆ యజమాని చేత చావు దెబ్బలు తిన్నారు.
సాధారణంగా ఉద్యోగం చేసే వారు ఎవరైనా ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి స్విచ్ అవ్వడం అనేది సహజం. కానీ, ఓ చోట కొందరు యువతీ యువకులు ఇలా ఓ కంపెనీలో ఉద్యోగాన్ని మానేసి.. మరో కంపెనీకి వెళ్లినందుకు ఆ యజమాని చేత చావు దెబ్బలు తిన్నారు.
Swetha
ఏమైనా కొన్ని కారణాల వలన ప్రస్తుతం చేస్తున్న కంపెనీలో ఉద్యోగం నచ్చకపోతే.. మరో కంపెనీలో ఉద్యోగం చేసుకునే స్వేచ్చ అందరికి ఉంటుంది. ఇప్పటివరకు అలా ఎంతో మంది యువతి యువకులు .. తమ ఉన్నతి కోసం కంపెనీలు మారడం చూస్తూనే ఉన్నాము. అది వారి వారి వ్యక్తిగత నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. దానిని అడ్డుకునే హక్కు ఎవరికీ ఉండదు. కానీ, ఇలాంటి విషయాల్లో తాజాగా జరిగిన ఓ సంఘటన మాత్రం అందరిని షాక్ అయ్యేలా చేసింది. ఆ కంపనీలో ఉద్యోగం నచ్చని కారణంగా.. కొంతమంది యువతి యువకులు మరొక కంపెనీకి మారినందుకు .. పాత కంపెనీ యజమాని వారిని చావు దెబ్బలు కొట్టాడు. దీని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అందరిని షాక్ కు గురి చేసిన ఈ సంఘటన మేడిపల్లి ప్రాంతంలో జరిగింది. గోదావరి ఖని నుంచి వచ్చిన ఓ యువతి ఉద్యోగం కోసం లాంగ్ డ్రైవ్ కార్స్ అనే కంపెనీలో జాయిన్ అయింది. దీని యజమాని కొప్పుల హరిదీప్ రెడ్డి. అయితే, ఆ యువతి అక్కడ కొంతకాలం వర్క్ చేసిన తరువాత .. అగ్రిమెంట్ అడిగిన కారణంగా ఆ ఉద్యోగం మానేసి .. గో కార్ట్స్ లో వర్క్ చేస్తుంది. ఈ క్రమంలో తన పాత స్నేహితులు కలవడానికి వచ్చింది . ఆ యువతి వచ్చిన మరుసటి రోజు నుంచి అక్కడే పని చేస్తున్న మరో ఆరుగురు తన స్నేహితులు కూడా .. ఆ ఉద్యోగాన్ని మానేశారు. లాంగ్ డ్రైవ్ కార్స్ యజమాని వారందరిని మంగళవారం ఆఫీసుకు పిలిపించి.. ఎందుకు మానేశారు అని ప్రశ్నించగా.. వారంతా మరో చోట ఉద్యోగంలో చేరమని చెప్పుకొచ్చారు. దీనితో ఆ యజమాని ఏం అనుకున్నాడో ఏమో .. వారి అందరిని కిడ్నాప్ చేసి.. వారి వద్ద నుంచి మొబైల్స్ తీసేసుకుని. వారి పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించాడు.
ఆ కంపెనీ యజమాని , అతనితో ఉన్న బౌన్సర్లు తో సహా .. అందరు కలిసి ఇద్దరు యువతులు, ఐదుగురు యువకులను వంటిపై వాతలు తేలేలా రాత్రంతా కొట్టారు. అంతేకాకుండా వారిలో ఉన్న ఓ గిరిజన మహిళ పట్ల .. కులాన్ని తక్కువ చేస్తూ.. కించపరుస్తూ దుర్భాషలాడాడు. పైగా ఈ విషయాలను ఎక్కడైనా చెప్తే.. వారిపై ఇల్లీగల్ కేసులు నమోదు చేస్తానని బెదిరించాడట. ఆ తరువాత యువతులను ఓసారి.. యువకులను ఓసారి బయటకు వదిలాడు ఆ యజమాని. దీనితో ఆ యువతి యువకులు లాంగ్ డ్రైవ్ కార్స్ యజమానిపై కేసు నమోదు చేశారు. కానీ, ఇప్పటివరకు దానిపై ఎటువంటి స్పందన లేకపోవడంతో.. వారికీ న్యాయం చేకూరాలంటూ ఆ యువతి యువకులు మీడియాతో మొరపెట్టుకున్నారు. ఈ కేసుకు సంబందించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.