Swetha
ఈ మధ్య కాలంలో ఇతర దేశాల్లో తెలుగు వారి వరుస మరణాలు అందరిని కలవరపెడుతున్నాయి. ఇప్పుడు ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లాలంటేనే అందరూ భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ లీడర్ కూతురు హత్యకు గురైంది.
ఈ మధ్య కాలంలో ఇతర దేశాల్లో తెలుగు వారి వరుస మరణాలు అందరిని కలవరపెడుతున్నాయి. ఇప్పుడు ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లాలంటేనే అందరూ భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ లీడర్ కూతురు హత్యకు గురైంది.
Swetha
ఇతర దేశాల్లో వరుస భారతీయ మహిళల హత్యలు ఇప్పుడు అందరిని కలవరపెడుతున్నాయి. ఇప్పటివరకు ఇలాంటి వార్తలు ఎన్నో చూస్తూ వచ్చాము.ముఖ్యంగా ఆస్ట్రేలియాలో జరిగే వరుస హత్యలు అందరిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. దీనితో ఇప్పుడు స్వదేశం వదిలి విదేశాలకు వెళ్లాలంటేనే.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే విదేశాల్లో ఉంటున్న తెలుగు వారి పట్ల .. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ వైద్యురాలు ఉజ్వల.. ట్రెకింగ్‌కు వెళ్లి లోయలో పడి మృతిచెందింన ఘటన మరువక ముందే.. ఇప్పుడు హైదరాబాద్ కు చెందిన వివాహిత బీఆర్ఎస్ లీడర్ కూతురు.. ఆస్ట్రేలియాలో హత్యకు గురైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఘటన ఆస్ట్రేలియాలో విక్టోరియా రాష్ట్రంలోని బక్లీ ప్రాంతంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు బాల్శెట్టిగౌడ్, మాధవి దంపతుల కుమార్తె చైతన్య. ఆమె వివాహానంతరం తన భర్తతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్ళింది. అక్కడ విక్టోరియా రాష్ట్రంలోని బక్లీ ప్రాంతంలో వారు నివసిస్తుండేవారు. అయితే, శనివారం రోజున చైతన్య దారుణంగా హత్యకు గురైంది. ఆమె ఉంటున్న నివాసానికి సుమారు 86 కిలోమీటర్ల దూరంలో.. ఓ చెత్తబుట్టలో ఆమె మృతదేహన్ని గుర్తించారు స్థానికులు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో.. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతురాలు హైదరాబాద్ AS రావు నగర్ కు చెందిన బీఆర్ఎస్ లీడర్ కూతురుగా గుర్తించారు పోలీసులు.. అయితే, ఈ ఘటనలో విచారిస్తున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఆ వివాహిత మృతికి తన భర్తే కారణం అని అనుమానిస్తున్నారు బంధువులు.
ఆమె భర్త ప్రస్తుతం తన కొడుకుతో కలిసి హైదరాబాద్ లో ఉండడం. సరిగా ఇదే సమయంలో ఆమె ఆస్ట్రేలియాలో హత్యకు గురి అవ్వడం వలన.. ఈ హత్య కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. ఈ హత్య వెనుక ఆమె భర్త హస్తం ఉన్నట్లు .. బంధువులు బలంగా అనుమానిస్తున్నారు. హత్య చేసిన వారికి కూడా ఆమెతో పరిచయం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. హత్య చేసిన తర్వాత దుండగులు మరో దేశానికీ పారిపోయారని పోలీసులు చెబుతున్నారు. అయితే, హత్యకు గల కారణాలైతే పోలీసులు ఇంకా పూర్తిగా నిర్దారించలేదు. ప్రస్తుతం ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే, ఆస్ట్రేలియాలో మహిళల హత్యపై అందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఈ వివాహిత హత్యతో కలిపి ఈ ఏడాది త్యకు గురైన వారి సంఖ్య 18కి చేరినట్లు రికార్డులు చెబుతున్నాయి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.