TS: కారు డిక్కీలో రూ.9 లక్షలు పెట్టి మర్చిపోయాడు! చివరికి ఏమైందటే?

హైదరాబాదు నగరంలో వరుస చోరిలకు పాల్పడుతూ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కారులో భారీ మొత్తంలో నగదు పెట్టుకొని బయటకు వెళ్లాడు. కానీ చివరికి ఏం జరిగిదంటే..

హైదరాబాదు నగరంలో వరుస చోరిలకు పాల్పడుతూ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కారులో భారీ మొత్తంలో నగదు పెట్టుకొని బయటకు వెళ్లాడు. కానీ చివరికి ఏం జరిగిదంటే..

నగరంలో దొంగల అలజడి రోజుకు రోజుకు ఎక్కువైపోతుంది. వరుస చోరిలకు పాల్పడుతు దుండగులు ప్రజలను హడలెత్తిస్తున్నారు. పట్టపగలే చాలా తెలివిగా దోపిడిలు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అపార్ట్ మెంట్ లోకి చొరబడి నగదు, బంగారం వంటివి దొంగలించడమే కాకుండా.. ఇళ్లలో పార్కింగ్ చేసే బైకులను సైతం అపహరించుకొనిపోయే ఘటనలు ఎన్నోం చూస్తున్నాం. వీటివలన ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నా.. ఎక్కడ ఓ చోట నిర్లక్ష్యం వహించడంతో.. దర్జగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరోసారి నగదు చోరి కలకరం రేపింది. మూసారాబాగ్ చెందిన ఓ వ్యక్తి తన కారులో నగదు మరచిపోవడంతో  ఏకంగా అన్ని లక్షలు పొగట్టుకున్నాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుత కాలంలో ప్రజలు రెప్పపాటు నిర్లక్ష్యంగా ఉన్న.. దొంగలు దొరలా… దర్జగా చోరిలకు పాల్పడుతున్నారు. ఇది తెలిసిన చాలామంది అప్రమత్తంగా ఉండకపోవడంతో భారీ మొత్తంలో నష్టపోతున్నారు. అయితే మూసారాబాగ్ చెందిన ఓ వ్యక్తి కూడా ఈ కోవకు చెందినవాడే.. తాజాగా ముసారాబాగ్ డివిజన్ సలీమ్ నగరానికి చెందిన రాజ్ కుమార్ కేడియా(50) తన పని నిమిత్తం ఈనెల 15న అనగా గురువారం మధ్యహ్నం రూ.9 లక్షలు తీసుకొని కారు డిక్కీలో పెట్టాడు. అనంతరం బంధువలు పెళ్లి వేడుకులకు హాజరయ్యాడు. అయితే కారు డిక్కీలో డబ్బులు పెట్టిన విషయం మార్చిపోయిన రాజ్ కుమార్ కు.. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం గుర్తు రావడంతో.. వెంటనే కారు డిక్కీ తెరిచి చూశాడు. అంతే ఒక్కసారిగా షాక్ గురైయ్యాడు. ఎందుకంటే.. ఆ కారు డిక్కీలో పెట్టిన రూ. 9లక్షల నగదు కనిపించలేదు. దీంతో షాక్ నుంచి తేరుకున్న బాధితుడు వెంటనే మలక్ పేట్ పోలీసులకు సంప్రాదించాడు. అక్కడ జరిగినదంత పోలీసులు చెప్పి ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే,  కారు డిక్కీలో అంత నగదు పెట్టి ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడోనని అందరూ ఆశ్చర్యనికి గురైయ్యారు. మరి, నిర్లక్ష్యంతో కారు డిక్కీలో నగదు పొగట్టుకున్న వ్యక్తి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments