Virat Kohli: భారత్ పరువు కాపాడిన కోహ్లీ.. కుర్రాళ్లను నమ్ముకుంటే ఇంక అంతే సంగతులు!

టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టు పరువు కాపాడాడు. దీంతో కుర్రాళ్లను నమ్ముకుంటే ఇంక అంతే సంగతులు అని అభిమానులు అంటున్నారు.

టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టు పరువు కాపాడాడు. దీంతో కుర్రాళ్లను నమ్ముకుంటే ఇంక అంతే సంగతులు అని అభిమానులు అంటున్నారు.

భారత క్రికెట్​ జట్టులో పైకి అన్నీ బాగానే కనిపిస్తున్నా లోపల మాత్రం పలు సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో టీమ్ బాగా వీక్​గా కనిపిస్తోంది. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై అతిగా ఆధారపడటం.. వాళ్లిద్దరూ ఫెయిలైతే మిగిలిన యంగ్​స్టర్స్ కూడా చేతులెత్తేయడం ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా టెస్టుల్లో నిలకడలేమి వేధిస్తోంది. దీని వల్ల బిగ్ టోర్నమెంట్స్​లో కీలక మ్యాచుల్లో ఓడి కప్పులు చేజార్చుకుంటోంది భారత్. రోహిత్, కోహ్లీల్లో ఎవరో ఒకరు క్రీజులో నిలబడకపోతే మ్యాచ్ గెలవడం కష్టమైపోతోంది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శుబ్​మన్ గిల్, యశస్వి జైస్వాల్ రూపంలో మంచి ప్రతిభావంతులు జట్టులో ఉన్నారు. వీళ్లు అడపాదడపా రాణిస్తున్నా కన్​సిస్టెంట్​గా పెర్ఫార్మ్ చేయడం లేదు. దీని ఎఫెక్ట్ బిగ్ మ్యాచెస్​లో కనిపిస్తోంది. ఐసీసీ ర్యాంకులు కూడా దీనికి అద్దం పడుతున్నాయి. ఈసారి ర్యాంకుల్లో భారత్ పరువు పోకుండా కోహ్లీ కాపాడాడు.

ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకులను ప్రకటించింది. లాంగ్​ ఫార్మాట్​లో ఆస్ట్రేలియా (117 పాయింట్లు) తొలి స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్​తో ఫస్ట్ టెస్ట్​లో ఓటమిని మూటగట్టుకున్న భారత్ అంతే పాయింట్లతో రెండో పొజిషన్​లో నిలిచింది. ఇంగ్లీష్ టీమ్ 115 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా (106), న్యూజిలాండ్ (95) నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. టెస్టుల్లో నంబర్ వన్ బ్యాటర్​గా కేన్ విలియమ్సన్ (864 పాయింట్లు) నిలిచాడు. సెకండ్ పొజిషన్​లో జో రూట్ (832), మూడో స్థానంలో డారిల్ మిచెల్ (786) ఉన్నారు. భారత్ నుంచి విరాట్ కోహ్లీ (767) ఒక్కడే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. అతడు టేబుల్​లో ఆరో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్​లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (853) టాప్​ ప్లేస్​ను కాపాడుకున్నాడు. పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా (825) నాలుగో స్థానంలో నిలిచాడు. ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా (754) ఏడో స్థానంలో నిలిచి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.

టెస్టు ర్యాంకింగ్స్​లో ఆరో స్థానంలో నిలిచిన కోహ్లీ.. వన్డేల్లో మూడో ప్లేసులో ఉన్నాడు. టీమిండియా తరఫున వన్డేలతో పాటు టెస్టుల్లోనూ టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ విరాటే. శుబ్​మన్ గిల్, రోహిత్ శర్మలు వన్డే ర్యాంక్సింగ్స్​లో టాప్​-5లో ఉన్నా.. టెస్టుల్లో మాత్రం టాప్​-10లో లేరు. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. కోహ్లీ టీమిండియా పరువు కాపాడాడని.. గిల్, జైస్వాల్, అయ్యర్ లాంటి యంగ్​స్టర్స్​ను నమ్ముకుంటే ఇంక అంతే సంగతులు అని కామెంట్స్ చేస్తున్నారు. కుర్రాళ్లు ఇకనైనా మేల్కొనాలని.. రోహిత్, విరాట్ ఉండగానే జట్టును గెలిపించే బాధ్యతల్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. బ్యాటింగ్ భారాన్ని కుర్రాళ్లు తీసుకుంటే హిట్​మ్యాన్, విరాట్ మరింత స్వేచ్ఛగా ఆడతారని అంటున్నారు. ఇకనైనా నిలకడగా ఆడి ర్యాంకింగ్స్​లో భారత్ పరువు పోకుండా నిలబెట్టాలని నెటిజన్స్ చెబుతున్నారు. మరి.. ర్యాంకింగ్స్​లో కోహ్లీ తప్ప ఒక్కరు కూడా టాప్​-10లో చోటు దక్కించుకోకపోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments