Hardik Pandya: ఎక్కడ IPL మిస్ అవుద్దో అని హార్దిక్ వర్కౌట్స్! ఆ లీగ్​పై ఇంత ఫోకస్ దేనికి?

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా కమ్​బ్యాక్ కోసం తెగ కష్టపడుతున్నాడు. జిమ్​లో వర్కౌట్స్​ చేస్తూ బాగా శ్రమిస్తున్నాడు. అయితే ఐపీఎల్​ కోసం ఇంత ఫోకస్ దేనికనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా కమ్​బ్యాక్ కోసం తెగ కష్టపడుతున్నాడు. జిమ్​లో వర్కౌట్స్​ చేస్తూ బాగా శ్రమిస్తున్నాడు. అయితే ఐపీఎల్​ కోసం ఇంత ఫోకస్ దేనికనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

లీగ్స్ ఎంట్రీతో క్రికెట్ స్వరూపమే మారిపోయింది. టీ10, టీ20ల వల్ల క్రికెట్ బోర్డుల మీద కనక వర్షం కురుస్తోంది. ప్లేయర్లు కూడా ఈ టోర్నమెంట్స్​లో ఆడి కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు. కొందరు ఆటగాళ్లయితే ఇంటర్నేషనల్ క్రికెట్​ను పక్కనబెట్టి కేవలం లీగ్స్​కే పరిమితం అవుతున్నారు. నేషనల్ టీమ్స్​కు ప్రాతినిధ్యం వహిస్తే వచ్చే డబ్బుల కంటే లీగ్స్​లో ఆడితే వచ్చే సొమ్ము ఎక్కువగా ఉండటం కూడా దీనికి ఓ కారణం. ముఖ్యంగా కరీబియన్ క్రికెట్​లో ఈ కల్చర్​ను ఎక్కువగా చూడొచ్చు. అక్కడి బోర్డు సరిగ్గా రెమ్యూనరేషన్స్ ఇవ్వకపోవడం, లీగ్స్​లో ధనార్జనకు అవకాశాలు ఉండటంతో విండీస్ ప్లేయర్లు ఇంటర్నేషనల్ కెరీర్​ను వదులుకుంటున్నారు. అయితే ఇది మంచిది కాదని.. జాతీయ జట్టుకు ఆడటం కంటే ఏదీ గొప్ప కాదని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. ఈ తరుణంలో టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఇదే విషయమై విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు. అసలు హార్దిక్​ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..

గాయం కారణంగా వన్డే వరల్డ్ కప్-2023 నుంచి తప్పుకున్న హార్దిక్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​తో పాటు సౌతాఫ్రికా టూర్​కు మిస్సయ్యాడు. అలాగే ఇటీవల జరిగిన ఆఫ్ఘానిస్థాన్ టీ20 సిరీస్​లోనూ పాల్గొనలేదు. ఇంగ్లండ్​తో 5 టెస్టుల సిరీస్​లో ఆడతాడని అనుకుంటే ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడ్ని దూరం పెట్టారు. అయితే ఇంజ్యురీ నుంచి ఫాస్ట్​గా రికవర్ అవుతున్న పాండ్యా.. అప్పుడప్పుడు వర్కౌట్ వీడియోస్ నెట్టింట్ షేర్ చేస్తున్నాడు. తాజాగా జిమ్​లో ఎక్సర్​సైజులు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో సైక్లింగ్, బ్రిస్క్ వాక్, స్కిప్పింగ్​తో పాటు బాక్సింగ్ లాంటి పలు వర్కౌట్లు చేస్తూ కనిపించాడు. ఈ వీడియో చూస్తుంటే అతడు పూర్తిగా కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. అతడి ఫిట్​నెస్​ లెవల్స్ మునుపటి కంటే మరింత మెరుగుపడినట్లు అనిపిస్తోంది. అయితే దీనిపై నెట్టింట హార్దిక్ ట్రోలింగ్​కు గురవుతున్నాడు.

ఎక్కడ ఐపీఎల్ మిస్ అవుద్దోననే హార్దిక్ ఇంతగా కష్టపడుతున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. క్యాష్ రిచ్ లీగ్​పై అంత ఫోకస్ అవసరమా అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇదేదో కాస్త ముందే కష్టపడితే ఆఫ్ఘాన్​ లేదా ఇంగ్లండ్ సిరీస్​లో భారత్​కు ఆడేవాడివి కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. టీమిండియాకు ఆడటం కంటే ఐపీఎల్​లో పాల్గొనడమే అంత ముఖ్యమా అని నెటిజన్స్ నిలదీస్తున్నారు. ఇంత కష్టపడుతున్నాడు సరే.. పూర్తిగా రికవర్ కాకుండానే ఐపీఎల్​లో ఆడి గాయపడితే అప్పుడు నష్టపోయేది టీమిండియానే కదా అని అడుగుతున్నారు. ఐపీఎల్​ మీద ఉన్న ప్రేమ దేశం మీద ఉంటే కెరీర్​ను సుదీర్ఘకాలానికి పొడిగించుకోవచ్చని నెటిజన్స్ చెబుతున్నారు. కాసుల కంటే భారత్​కు ఆడటమే ముఖ్యంగా పెట్టుకోవాలని.. అప్పుడే దేశానికి వరల్డ్ కప్ సాధించి పెట్టొచ్చని సూచిస్తున్నారు. ఈ లీగుల వల్ల డబ్బు మాత్రమే వస్తుందని.. పేరు, ప్రఖ్యాతులు రావాలంటే దేశం తరఫున గొప్పగా రాణించడం ఒక్కటే మార్గమని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. పాండ్యాపై వస్తున్న విమర్శల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments