Nidhan
2011 వన్డే వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టెన్. యువకులు, అనుభవజ్ఞులతో కూడిన టీమ్‌కు సరైన సలహాలు, సూచనలు ఇచ్చి ఛాంపియన్‌గా నిలబెట్టాడు.
2011 వన్డే వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టెన్. యువకులు, అనుభవజ్ఞులతో కూడిన టీమ్‌కు సరైన సలహాలు, సూచనలు ఇచ్చి ఛాంపియన్‌గా నిలబెట్టాడు.
Nidhan
ఈ మధ్య కాలంలో టీమిండియా అన్ని విభాగాల్లోనూ చాలా పటిష్టంగా తయారైంది. బ్యాటింగ్ ఎప్పుడూ భారత్ బలంగానే ఉంది. కానీ ఇప్పుడు బౌలింగ్‌లోనూ అంతే పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా వంటి పేసర్లు.. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్పిన్నర్ల కలబోతతో టీమ్ సూపర్ స్ట్రాంగ్‌గా మారింది. చాలా మంది యంగ్‌స్టర్స్ బ్యాకప్‌గా ఉండటంతో అన్ని ఫార్మాట్లలోనూ టీమ్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. అయితే ఐసీసీ ట్రోఫీల్లో మాత్రం భారత్‌కు నిరాశ తప్పడం లేదు. అప్పుడెప్పుడో 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గాం. ఆ తర్వాత పలుమార్లు సెమీస్, ఫైనల్స్‌కు వెళ్లినా కప్పును మాత్రం ఒడిసిపట్టలేకపోయాం. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో టీమిండియా తుదిమెట్టుపై జారి కప్పులు కోల్పోవడంపై మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ రియాక్ట్ అయ్యాడు. 2011 వరల్ కప్‌లో భారత్‌ను విజేతగా నిలిపిన కిర్‌స్టెన్.. ఇప్పుడు అవసరమైతే టీమిండియాకు కోచింగ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నానని చెప్పాడు.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్-2023 మిస్ అయినప్పటికీ.. త్వరలోనే టీమిండియా ప్రపంచ కప్‌ను సాధిస్తుందని కిర్‌స్టెన్ అన్నాడు. అయితే మెగాటోర్నీలో విజేతగా నిలవడం అంత ఈజీ కాదన్నాడు. ఇది చాలా కష్టమని తెలిపాడు. ‘ప్రపంచ కప్‌ను నెగ్గడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టడం ఎవరికైనా కష్టమే. అయితే, టీమిండియా మాత్రం గట్టిపోటీ ఇచ్చిందనే చెప్పాలి. కొన్ని విజయాలను నమోదు చేస్తే భారత్ వరల్డ్ కప్ గెలవడం ఖాయం. అది త్వరలోనే నెరవేరుతుందని భావిస్తున్నా. మరికొన్ని నెలల్లో పొట్టి ఫార్మాట్లో ప్రపంచ కప్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ గెలుస్తుందనే నమ్మకం ఉంది. ఆ సత్తా టీమిండియాకు ఉందనడంలో ఏ డౌట్ లేదు. అయితే, నాకౌట్ దశలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పొట్టి ఫార్మాట్లో ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది’ అని కిర్‌స్టెన్ చెప్పుకొచ్చాడు.
ప్రతి ఏడాది తాను భారత్‌కు వస్తుంటానని కిర్‌స్టెన్ పేర్కొన్నాడు. ఈసారి ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీకి మెంటార్‌గా వ్యవహరించబోతున్నానని తెలిపాడు. టీమిండియా కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశాడు. కానీ ఇప్పుడు దీని గురించి ఆలోచించడం లేదన్నాడు. ఫోకస్ మొత్తం గుజరాత్ టైటాన్స్‌ను నడిపించడం మీదే ఉందని కిర్‌స్టెన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుత తరం ఆటగాళ్లలో శుబ్‌మన్ గిల్ బెస్ట్ అని మెచ్చుకున్నాడు. గత ఐపీఎల్లో అతడు 890 పరుగులు చేశాడని.. ఈసారి కూడా బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణిస్తాడని భావిస్తున్నానని కిర్‌స్టెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. టీ20లకు వరల్డ్‌వైడ్‌గా ఆదరణ పెరుగుతోందని.. క్రికెట్లోకి రావాలనుకునే యువతకు స్ఫూర్తిని నింపడంలో ఈ లీగ్‌ల పాత్ర ఎంతో ఉందన్నాడు. మరి.. భారత్‌కు మళ్లీ కోచింగ్ చేసేందుకు తాను రెడీ అంటూ కిర్‌స్టెన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.