Nidhan
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పబ్లిక్‌గా ఓపెన్ అవ్వడు. తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకునేందుకు అస్సలు ఇష్టపడడు. అలాంటోడు తన భార్యపై వస్తున్న ట్రోల్స్ మీద సీరియస్ అయ్యాడు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పబ్లిక్‌గా ఓపెన్ అవ్వడు. తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకునేందుకు అస్సలు ఇష్టపడడు. అలాంటోడు తన భార్యపై వస్తున్న ట్రోల్స్ మీద సీరియస్ అయ్యాడు.
Nidhan
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉంది భారత జట్టు. 5 టెస్టుల ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచులు ముగిశాయి. ఉప్పల్ టెస్టులో ఇంగ్లీష్ టీమ్ నెగ్గగా.. వైజాగ్ ఆతిథ్యం ఇచ్చిన రెండో మ్యాచులో టీమిండియా ఘనవిజం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్‌లో కీలకమైన మూడో టెస్టుకు రాజ్‌కోట్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కమ్‌బ్యాక్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. గాయంతో రెండో టెస్టు నుంచి తప్పుకున్న జడ్డూ.. ఇప్పుడు ఫిట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న అతడు ఇంజ్యురీ నుంచి కోలుకొని బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడని క్రికెట్ వర్గాల సమాచారం. అయితే ఎంతో రిజర్వ్డ్గా ఉండే జడేజా తాజాగా తన భార్యపై వస్తున్న ట్రోల్స్ మీద సీరియస్ అయ్యాడు. అవన్నీ పచ్చి అబద్ధాలు అని అన్నాడు.
జడేజా ఫ్యామిలీలో అతడి భార్య రివాబా చీలిక తీసుకొచ్చిందని నెట్టింట రూమర్స్ వస్తున్నాయి. స్టార్ క్రికెటర్ కుటుంబంలో ఘర్షణలకు ఆమెనే కారణమంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీనంతటికీ బీజం జడేజా తండ్రి దివ్య భాస్కర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూనే కారణం. జడ్డూతో గానీ అతడి భార్యతో గానీ తనకు ఎలాంటి రిలేషన్ లేదని ఒక ఇంటర్వ్యూలో దివ్య భాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏదైనా పండుగ, శుభకార్యం ఉంటే రమ్మని జడేజా తమను పిలవడని.. తామూ అతడ్ని ఇంటికి పిలవమని చెప్పారు. అతడి పెళ్లైన రెండు, మూడు నెలలకే ఈ సమస్య మొదలైందని తెలిపారు. తాము జామ్‌నగర్‌లో ఉంటామని, జడ్డూ అదే సిటీలోని ఓ సెపరేట్ బంగ్లాలో ఉంటాడని పేర్కొన్నాడు. అతడి భార్య రివాబా ఏ మంత్రం వేసిందో తెలియదు గానీ కుటుంబాన్ని ముక్కలు చేసిందని ఆరోపించారు దివ్య భాస్కర్.
జడేజా భార్యపై అతడి తండ్రి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో రివాబాను టార్గెట్ చేసుకొని చాలా మంది నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. అతడి కుటుంబాన్ని ఆమె చీల్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై జడ్డూ రియాక్ట్ అయ్యాడు. ఆ ఇంటర్వ్యూలో తన తండ్రి చేసిన వ్యాఖ్యలన్నీ పచ్చి అబద్ధాలని చెప్పాడు. ‘ఆ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రతి మాటా పచ్చి అబద్ధం. అవి నిజం కాదు. అవన్నీ ఏకపక్షంగా చేసిన వ్యాఖ్యలు. నా భార్య ఇమేజ్ను దెబ్బతీసేందుకు చేసిన ఈ కామెంట్స్‌ను ఖండిస్తున్నా. నా తరఫున నేను చెప్పాల్సింది కూడా ఎంతో ఉంది. కానీ పబ్లిక్‌గా మాత్రం అది పంచుకోను’ అని జడేజా స్పష్టం చేశాడు. స్టార్ ఆల్‌రౌండర్ కామెంట్స్‌పై అతడి అభిమానులు స్పందిస్తున్నారు. జడ్డూకు తాము సపోర్ట్ చేస్తామని.. ఇంటి వ్యవహారాలు బయట చెప్పడం తనకు ఇష్టం లేదని అనడం అతడి వ్యక్తిత్వానికి నిదర్శనమని చెబుతున్నారు. కుటుంబంలోని గొడవను ఇలా రచ్చకు ఈడ్చడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరి.. జడేజా ఇంటి గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ravindra Jadeja clears the on-air rumours regarding the news of his family issues surfacing on the internet. pic.twitter.com/Lcxn128ii8
— CricTracker (@Cricketracker) February 9, 2024
Let’s ignore what’s said in scripted interviews 🙏 pic.twitter.com/y3LtW7ZbiC
— Ravindrasinh jadeja (@imjadeja) February 9, 2024