iDreamPost
android-app
ios-app

బిగ్‌ బ్రేకింగ్‌: ఓటుకు నోటు కేసులో CM రేవంత్‌ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ!

  • Published Sep 24, 2024 | 3:39 PM Updated Updated Sep 24, 2024 | 3:39 PM

Nampally Court, CM Revanth Reddy, Otuku Notu Case: తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టంచిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి గట్టి షాక్‌ ఇచ్చింది కోర్టు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Nampally Court, CM Revanth Reddy, Otuku Notu Case: తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టంచిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి గట్టి షాక్‌ ఇచ్చింది కోర్టు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Sep 24, 2024 | 3:39 PMUpdated Sep 24, 2024 | 3:39 PM
బిగ్‌ బ్రేకింగ్‌: ఓటుకు నోటు కేసులో CM రేవంత్‌ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ!

ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఈ కేసును విచారించిన కోర్టు.. కేసులో నిందితులుగా ఉన్న వారు విచారణకు హాజరుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు విచారణ అనంతరం కోర్టు ఇచ్చిన ఆదేశాలు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి షాకిచ్చేలా ఉన్నాయి. ఓటుకు నోటు ఈడీ కేసులో నిందితులు విచారణకు కచ్చితంగా హాజరు కావాలని, ఈ రోజు గైర్హాజరును ఉపేక్షించిన కోర్టు.. అక్టోబర్‌ 16న జరిగే విచారణకు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. ఆయనతో పాటు ఉదయ్‌ సింహ, వేం కృష్ణకీర్తన్‌, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్‌ సైతం విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం జరిగిన విచారణకు మత్తయ్య మాత్రమే హాజరయ్యారు. నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ హాజరు కాలేదు.

కొన్ని రోజుల క్రితం ఈ ఓటుకు నోటు కేసు బదిలీ పిటీషన్‌పై సుప్రీం కోర్టు కూడా విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా రేవంత్‌ రెడ్డి.. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నందున ఆయన ప్రాసిక్యూషన్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున.. కేసును మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు బదిలీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత జగదీశ్‌ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. కేసును బదిలీ చేసేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‌ను అనుమానంతో వేశారే తప్పా.. ఇందులో ప్రాథమిక ఆధారాలు కూడా లేవని కోర్టు అభిప్రాయపడింది. అలా రేవంత్‌ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట దక్కినా.. నాంపల్లి కోర్టు మాత్రం.. ఆయన అక్టోబర్‌ 16న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

సీఎం హాజరుపై ఉత్కంఠ..

నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి అక్టోబర్‌ నెల 16న విచారణకు హాజరు అవుతారా? లేదా? అనే విషయం అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి.. ఓటుకు నోటు లాంటి కేసులో విచారణకు హాజరు కావడం అంటే.. చిన్న విషయం కాదు. బహుషా.. రేవంత్‌ రెడ్డి విచారణకు హాజరు కాకుండా.. తన గైర్హాజరికి తగిన కారణం కోర్టుకు వివరిస్తారని న్యాయనిపుణులు భావిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి కాకుండా.. ఈ కేసు నిందితులుగా ఉన్న మిగతా సభ్యులు మాత్రం వచ్చే విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి సీఎంను విచారణకు రావాలని నాంపల్లి కోర్టు ఆదేశించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.