Nidhan
వైజాగ్ టెస్ట్‌కు అంతా సిద్ధమైంది. ఇంగ్లండ్‌తో మరోమారు తాడోపేడో తేల్చుకునేందుకు టీమిండియా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
వైజాగ్ టెస్ట్‌కు అంతా సిద్ధమైంది. ఇంగ్లండ్‌తో మరోమారు తాడోపేడో తేల్చుకునేందుకు టీమిండియా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
Nidhan
విశాఖపట్నం టెస్టుకు సర్వం సిద్ధమైంది. భారత్-ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నాడు రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌కు వైజాగ్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఉప్పల్ టెస్టులో అనూహ్య ఓటమి ఎదురవడంతో డీలాపడ్డ భారత్ ఈ మ్యాచ్‌తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. ఇంగ్లీష్ టీమ్‌ను చిత్తు చేయాలని చూస్తోంది. బజ్‌బాల్ క్రికెట్‌తో తమను ఎదురుదెబ్బ తీసిన ప్రత్యర్థికి గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తోంది. అందుకు ఈసారి స్పిన్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ పిచ్‌ను స్పిన్నర్లకు అనుకూలంగా తయారు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ టెస్టుకు కూడా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. గాయాల వల్ల స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
వైజాగ్ పిచ్ గతంలో బ్యాటర్లతో పాటు స్పిన్నర్లు, పేసర్లకు కూడా బాగా సహకరించేంది. కానీ ఈసారి టర్నింగ్ ట్రాక్‌ను తయారు చేశారని తెలుస్తోంది. దీంతో తాము నలుగురు స్పిన్నర్లతో వెళ్లేందుకు ఏమాత్రం భయపడమని ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియా కూడా అదే సూత్రాన్ని ఫాలో అవడం ఖాయంలా కనిపిస్తోంది. బ్యాటింగ్ విషయానికొస్తే.. ఓపెనింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మకు తోడుగా యంగ్‌స్టర్ యశస్వి జైస్వాల్ దిగుతాడు. కోహ్లీ లేడు కాబట్టి ఫస్ట్ డౌన్లో శుబ్‌మన్ గిల్ ఆడటం పక్కా. ఆ తర్వాత సెకండ్ డౌన్లో శ్రేయస్ అయ్యర్ దిగుతాడు. మిడిలార్డర్ భారాన్ని మోసే రాహుల్ లేకపోవడంతో అతడి ప్లేసులో ఎవరు ఆడతారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. రజత్ పాటిదార్‌తో పాటు యంగ్ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్లు ఈ స్థానం కోసం పోటీపడుతున్నారు. కానీ సర్ఫరాజ్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో అతడ్ని ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వికెట్ కీపింగ్ బాధ్యతల్ని కేఎస్ భరత్ చూసుకుంటాడు. అతడి తర్వాత స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ఆడతారు. జడేజా దూరమయ్యాడు కాబట్టి అతడి ప్లేసులో యంగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడటం ఖాయం. పేస్ బౌలింగ్ బాధ్యతల్ని జస్ప్రీత్ బుమ్రా చూసుకుంటాడు. అయితే అతడితో పాటు మరో పేసర్‌గా మహ్మద్ సిరాజ్‌ను ఆడిస్తారా లేదా స్పిన్ వికెట్ అనే వార్తల నేపథ్యంలో కుల్దీప్ యాదవ్‌ను మెయిన్ టీమ్‌లోకి తీసుకుంటారా అనేది చూడాలి. సిరాజ్ మొదటి టెస్టులో ఫెయిలయ్యాడు. వికెట్లు తీయకపోవడంతో పాటు రన్స్ కూడా ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో బాల్ మొదటి రోజు నుంచి టర్న్ అవుతుందని భావిస్తే అతడ్ని బెంచ్‌కే పరిమితం చేస్తారు. అయితే మ్యాచ్‌కు ముందు పిచ్‌ను పూర్తిగా పరిశీలించాకే సిరాజ్, కుల్దీప్ల్లో ఎవర్ని ఆడిస్తారనేది డిసైడ్ అవ్వొచ్చు. మరి.. వైజాగ్ టెస్టులో భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇంకేమైనా మార్పులు ఉంటాయని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్/కుల్దీప్ యాదవ్.
— BCCI (@BCCI) January 31, 2024