Nidhan
భారత క్రికెట్ జట్టును ఉద్దేశించి బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్లు ఉండగా మనం ఎందుకు భయపడాలని ప్రశ్నించాడు.
భారత క్రికెట్ జట్టును ఉద్దేశించి బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్లు ఉండగా మనం ఎందుకు భయపడాలని ప్రశ్నించాడు.
Nidhan
ఒకప్పుడు టీమిండియా అంటే అందరికీ బ్యాటర్లే గుర్తుకొచ్చేవారు. గవాస్కర్ నుంచి సచిన్ వరకు ఎందరో దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ను క్రికెట్‌కు అందించింది భారత్. ఇప్పుడు కూడా మన జట్టు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలే క్రికెట్‌ను ఏలుతున్నారు. అయితే బ్యాటింగే కాదు.. ఇప్పుడు బౌలింగ్ కూడా భారత్ బలంగా మారింది. స్పిన్ బౌలింగ్‌లో ఫస్ట్ నుంచి మన టీమ్ తోపే. కానీ ఇప్పుడు పేస్ బౌలింగ్ కూడా ప్రధాన అస్త్రంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమితో పాటు మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్ రూపంలో ఫెంటాస్టిక్ పేస్ అటాక్ మన దగ్గర ఉంది. అందుకే ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అన్నింటా రోహిత్ సేన డామినేషన్ నడుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఈ తరుణంలో బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత్ ఎందుకు భయపడాలని అన్నాడు.
బుమ్రా, షమి, సిరాజ్ రూపంలో అద్భుతమైన పేస్ బౌలర్లు జట్టులో ఉన్నప్పుడు టీమిండియా ఎందుకు భయడాలన్నాడు గంగూలీ. టెస్టుల్లో ఇంకా టర్నింగ్ ట్రాక్స్ తయారు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. మంచి పేసర్లు టీమ్‌లో ఉన్నప్పుడు పేస్ పిచ్‌లు రూపొందించొచ్చు కదా అని క్వశ్చన్ చేశాడు. ‘బుమ్రా, షమి, సిరాజ్, ముకేష్ బౌలింగ్ చూశాక భారత్‌లో టర్నింగ్ ట్రాక్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారని ఆశ్చర్యపోతున్నా. మంచి వికెట్ల మీద ఆడినప్పుడు ప్రతి మ్యాచ్‌కు టీమ్ మరింత స్ట్రాంగ్‌గా మారుతుంది. అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్‌లు కలిస్తే ఏ వికెట్ మీదనైనా 20 వికెట్లు తీయగలరు. ఆ సత్తా వాళ్లకు ఉంది’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. స్పిన్ పిచ్‌ల వల్ల గత 6 నుంచి 7 ఏళ్లుగా మన జట్టు బ్యాటింగ్ క్వాలిటీ దారుణంగా దెబ్బతింటోందని పేర్కొన్నాడు. పేస్‌కు సహకరించే వికెట్లను తయారుచేసినా భారత్ 5 రోజుల్లోపే మ్యాచులను ఫినిష్ చేస్తుందని దాదా స్పష్టం చేశాడు.
ఇక, ఉపఖండంలో భారత్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు కూడా స్పిన్ ట్రాక్స్‌నే సిద్ధం చేస్తుంటాయి. టర్నింగ్ ట్రాక్స్‌తో ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తుంటాయి. అయితే ఒకప్పుడు ఉపఖండ జట్లలో క్వాలిటీ స్పిన్నర్లతో పాటు టాప్ క్లాస్ బ్యాటర్స్ ఉండేవారు. కాబట్టి విదేశీ జట్లు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్లను తక్కువ స్కోర్లకే ఆలౌట్ చేసేవారు. ఆ తర్వాత మన బ్యాటర్లు అవతలి జట్టులోని స్పిన్నర్లను చితకబాదేవారు. కానీ ఇప్పుడు స్పిన్ బౌలింగ్‌లో బాగా ఆడే బ్యాటర్లు తగ్గిపోయారు. మంచి టెక్నిక్ కలిగిన బ్యాట్స్‌మెన్ ఈ తరంలో తక్కువ. భారత జట్టులో కూడా రోహిత్, కోహ్లీతో పాటు అయ్యర్ స్పిన్‌ను బాగా ఆడగలడు. మిగతా వాళ్లు పేస్‌ను బాగా ఎదుర్కొన్నా స్పిన్నర్లకు దొరికిపోతున్నారు. ఇంగ్లండ్ సిరీస్‌లోనూ ఇది ప్రూవ్ అయింది. ఈ నేపథ్యంలో గంగూలీ టర్నింగ్ ట్రాక్స్ ఎందుకు? పేస్ వికెట్లు తయారు చేయలేమా? అని ప్రశ్నించాడు. స్పిన్ ట్రాక్స్ వల్ల బ్యాటింగ్ క్వాలిటీ తగ్గిపోయిందన్నాడు. మరి.. టీమిండియాపై గంగూలీ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
When I see Bumrah Sami Siraj Mukesh bowl . I wonder why do we need to prepare turning tracks in india ..my conviction of playing on good wickets keeps getting stronger every game .. They will get 20 wickets on any surface with ashwin jadeja Kuldeep and axar .. batting quality…
— Sourav Ganguly (@SGanguly99) February 3, 2024