Nidhan
ఇంగ్లండ్‌పై మూడో టెస్టులో ఘనవిజయం సాధించడం మీద భారత కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యాడు. ఈ సక్సెస్‌కు క్రెడిట్ మొత్తం వాళ్లకే ఇస్తానన్నాడు.
ఇంగ్లండ్‌పై మూడో టెస్టులో ఘనవిజయం సాధించడం మీద భారత కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యాడు. ఈ సక్సెస్‌కు క్రెడిట్ మొత్తం వాళ్లకే ఇస్తానన్నాడు.
Nidhan
రాజ్‌కోట్ టెస్టులో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది భారత్. పటిష్టమైన ఇంగ్లండ్‌ను ఏకంగా 434 పరుగుల తేడాతో చిత్తు చేసింది. పరుగుల పరంగా చూసుకుంటే టెస్టు క్రికెట్ హిస్టరీలో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. అటు బ్యాటర్లతో పాటు ఇటు బౌలర్లు కూడా సూపర్బ్‌గా రాణించడంతోనే మరో రోజు మిగిలి ఉండగానే ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన విక్టరీ కొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ (131) సెంచరీతో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 150 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. బ్యాట్‌తో రాణించడమే గాక కెప్టెన్‌గానూ ఆకట్టుకున్నాడు. సరైన టైమ్‌లో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం, ప్రత్యర్థి బ్యాటర్లకు తగ్గట్లు బౌలింగ్ ఛేంజెస్ చేయడం కలిసొచ్చింది. ఇవన్నీ వర్కౌటై విజయం భారత్ సొంతమైంది. అయినా మొత్తం క్రెడిట్ వాళ్లకే ఇస్తానని అంటున్నాడు హిట్‌మ్యాన్. ఈ మ్యాచ్‌లో అసలైన హీరోలు వాళ్లేనన్నాడు.
మూడో టెస్టు విజయం తర్వాత రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ విక్టరీకి మొత్తం క్రెడిట్ యంగ్‌స్టర్స్‌కే ఇస్తానని చెప్పాడు. తాను కాదు.. వాళ్లే అసలైన హీరోలని మెచ్చుకున్నాడు. ‘ఈ మ్యాచ్‌లో విజయానికి కుర్రాళ్లకు మొత్తం క్రెడిట్ ఇవ్వాలి. వాళ్లకు అంతగా అనుభవం లేదు. అరంగేట్ర ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ అద్భుతంగా ఆడారు. తమలోని అసలైన సత్తా ఏంటో అందరికీ చూపించారు. వాళ్లు హీరోలుగా నిలిచారు. ఈ విక్టరీ ఎంతో సంతృప్తిని ఇచ్చింది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. సర్ఫరాజ్ మంచి క్వాలిటీ బ్యాటర్ అని.. బ్యాట్‌తో తానేం సాధించగలడో మనందరం చూశామన్నాడు. జైస్వాల్ గురించి ఎన్నోసార్లు చెప్పానని.. అతడు ఇదే పెర్ఫార్మెన్స్ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నానని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గడం టర్నింగ్ పాయింట్ అని తెలిపాడు.
‘ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బాగా ఆడింది. ఆ టీమ్ బ్యాటర్లు దూకుడుగా ఉన్న టైమ్‌లో మా బౌలర్లకు ఒకటే చెప్పా. వాళ్లు బజ్‌బాల్ క్రికెట్ ఆడినా మీరు కూల్‌గా ఉండండి. మూడో రోజు మా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. రవీంద్ర జడేజా తన ఎక్స్‌పీరియెన్స్ మొత్తం వాడాడు. బ్యాటింగ్‌లోనూ సెంచరీతో చెలరేగాడు. సర్ఫరాజ్ క్వాలిటీ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. జైస్వాల్ తన కెరీర్‌ను అత్యుత్తమంగా స్టార్ట్ చేశాడు. అతడు దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. సర్ఫరాజ్, జురెల్ తమకు వచ్చిన ఛాన్సులను సద్వినియోగం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో విజయానికి కుర్రాళ్లకు ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. నా మటుకు టీమ్ కోసం చేసే ప్రతి పరుగు, ప్రతి సెంచరీ ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తా. అంతేగానీ సెంచరీలను ఎక్కువగా పట్టించుకోను’ అని రోహిత్ స్పష్టం చేశాడు. మరి.. మూడో టెస్టు విక్టరీని ఉద్దేశించి హిట్‌మ్యాన్ చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Yashasvi Jaiswal: జైస్వాల్‌కు అన్యాయం! ఇలా జరగడం రెండోసారి
Rohit Sharma said “Credit to the young boys, they don’t have much experience, two debutants, showed lots of character, they want to belong here so it’s so satisfying to win a Test match like this”. pic.twitter.com/a3M6IFMTlk
— Johns. (@CricCrazyJohns) February 18, 2024
Rohit Sharma said, “Sarfaraz Khan being Sarfaraz with his batting, we all saw what he could do”. pic.twitter.com/2r5ku594M5
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 18, 2024