Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు జోష్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో విజయంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అయితే హిట్‌మ్యాన్ విషయంలో భారత క్రికెట్ బోర్డు మాస్టర్ ప్లాన్ వేస్తోంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు జోష్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో విజయంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అయితే హిట్‌మ్యాన్ విషయంలో భారత క్రికెట్ బోర్డు మాస్టర్ ప్లాన్ వేస్తోంది.
Nidhan
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో విక్టరీ సాధించడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. బజ్‌బాల్ బెండు తీయడంతో సంతోషంలో మునిగిపోయాడు. ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో స్టోక్స్ సేనను ఓడించి సిరీస్‌ను సమం చేయడంతో హ్యాపీగా ఉన్నాడు. సిరీస్‌లోని మొదటి టెస్టులో ఓడటంతో హిట్‌మ్యాన్ భారీగా విమర్శల్ని ఎదుర్కొన్నాడు. అటు బ్యాటర్‌గా ఫెయిలవడం, ఇటు సారథిగానూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రోహిత్‌కు ఏమైందనే కామెంట్లు వినిపించాయి. అతడి పనైపోయిందని కొందరు సీనియర్లు వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో జట్టు అద్భుతంగా పుంజుకొని విజయం సాధించడంతో రోహిత్‌కు ఊరట దక్కింది. అయితే హిట్‌మ్యాన్ విషయంలో బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తోందని తెలిసింది. గతేడాది వన్డే ప్రపంచ కప్ మిస్సయింది కాబట్టి కనీసం పొట్టి ఫార్మాట్లోనైనా కప్పు కొట్టాలనే కసితో ఉంది బోర్డు. అందుకోసం ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తోంది. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ముఖ్యం. కాబట్టి అతడి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆడుతున్న హిట్‌మ్యాన్ ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో బిజీ అయిపోతాడు. క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌లో బిజీ అయిపోతాడు. అయితే వరుసగా క్రికెట్ ఆడితే అతడు గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని బీసీసీఐ భయపడుతోంది.
ఐపీఎల్‌కు టీ20 వరల్డ్ కప్‌కు మధ్య కొంత గ్యాప్ ఉంది. క్యాష్ రిచ్ లీగ్ షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ మెగా లీగ్ ముగిసిన తర్వాత ప్రపంచ కప్‌కు సన్నద్ధం అయ్యేందుకు కనీసం 15 నుంచి 30 రోజుల వరకు టైమ్ దొరికే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ గ్యాప్‌లో రోహిత్‌ను రంజీల్లో ఆడించే ఆలోచనల్లో భారత క్రికెట్ బోర్డు ఉందట. అయితే ఇప్పటికే సౌతాఫ్రికా టూర్, ఆఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో రోహిత్ ఆడుతున్నాడు. ఈ సిరీస్ పూర్తయిన తర్వాత ఐపీఎల్లో నెలన్నర పాటు ఆడాల్సి ఉంటుంది. అతడికి రెస్ట్ దొరికే ఛాన్స్ లేదు.
వరుస సిరీస్‌లతో అలసిపోయిన హిట్‌మ్యాన్‌ను రంజీల్లో ఆడించాలా? లేదా విశ్రాంతి ఇవ్వాలా? అనే విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు ఇతర బోర్డు మెంబర్స్ తర్జనభర్జనలు పడుతున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే అతడు ఓకే అంటే రంజీల్లో ఆడించాలని అనుకుంటున్నారట. దీని వల్ల రోహిత్ మరింత ఫామ్‌ను పుంజుకునే అవకాశం ఉందని.. ఇది టీ20 వరల్డ్ కప్‌లో అక్కరకొస్తుందని బోర్డు భావిస్తోందట. ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం హిట్‌మ్యాన్ దుమ్మురేపడం ఖాయమని.. పొట్టి కప్పు మనదేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. టీ20 వరల్డ్ కప్‌కు ముందు రోహిత్ విషయంలో బీసీసీఐ చేస్తున్న ప్లానింగ్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: IND vs ENG: చిన్నతనం నుంచి వాళ్లను చూస్తూ పెరిగా! బుమ్రా ఎమోషనల్ స్టేట్‌మెంట్
BCCI official to InsideSport, “Rohit is a crucial player in T20 World Cup. With IPL after the England series, he will play a lot of cricket and could be an injury risk. So, whether he should play Ranji Trophy is a serious discussion for the team management and Ajit.”
📷 Getty… pic.twitter.com/MLD4wH3hbH
— CricketGully (@thecricketgully) February 4, 2024