IND vs ENG: రోహిత్​కు అసలు ఏమైంది? మాటలకు ఆటకు పొంతనే లేదు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోమారు ఫెయిలయ్యాడు. దీంతో అసలు హిట్​మ్యాన్​కు ఏమైంది? అతడి మాటలకు, ఆటకు పొంతన లేదనే విమర్శలు మొదలయ్యాయి.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోమారు ఫెయిలయ్యాడు. దీంతో అసలు హిట్​మ్యాన్​కు ఏమైంది? అతడి మాటలకు, ఆటకు పొంతన లేదనే విమర్శలు మొదలయ్యాయి.

క్రికెట్​లో ఏ టీమ్ విజయం సాధించాలన్నా అందరు ప్లేయర్లు రాణించాల్సిందే. ఏ ఒక్కరో రాణిస్తే విజయం సొంతమవదు. ఇది అందరూ కలసికట్టుగా ఆడే గేమ్. ముఖ్యంగా జట్టు సారథి మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. టీమ్ గెలుపోటముల్లో కెప్టెన్ కీలకపాత్ర పోషిస్తుంటారు. సెలక్షన్ దగ్గర నుంచి ప్రతి డిసిషన్​లో ముఖ్య భూమిక పోషించే కెప్టెన్.. పెర్ఫార్మెన్స్​ పరంగానూ చాలా కీలకం అవుతారు. ఒక జట్టు సారథి బాగా ఆడుతున్నాడంటే మిగతా ప్లేయర్ల మీద కూడా తప్పక రాణించాలనే ఒత్తిడి పడుతుంది. సరిగ్గా ఆడకపోతే తమ ప్లేస్ ఖాయం కాదనే భయం వెంటాడుతుంది. అయితే కెప్టెన్ సరిగ్గా ఆడకపోతే అది జట్టు మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. భారత సారథి రోహిత్ శర్మ ఫెయిల్యూర్ ఇప్పుడు జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇంగ్లండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​లో హిట్​మ్యాన్ వైఫల్యం కొనసాగుతోంది.

రోహిత్ మరోమారు ఫెయిలయ్యాడు. వైజాగ్​లో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్​లో హిట్​మ్యాన్ 13 పరుగులకే పెవిలియన్​కు చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్​లో 14 పరుగులు చేసిన భారత కెప్టెన్.. ఈసారి 13 పరుగులకు ఔటయ్యాడు. మంచి స్టార్ట్ దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇంగ్లండ్ వెటరన్ సీమర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్​లో క్లీన్ బౌల్డ్‌ అయ్యాడు. ఆఫ్ స్టంప్ మీద పడిన బంతిని రోహిత్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బాల్ అతడి బ్యాట్​ను దాటుకొని వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో నిరాశతో అతడు క్రీజును వీడాడు. వన్డేలు, టీ20ల్లో అదరగొడుతున్న రోహిత్ టెస్టుల్లో మాత్రం తేలిపోతున్నాడు. ఈ మధ్య మ్యాచుల్లో అతడి స్కోర్లు చూస్తే ఇది అర్థమవుతుంది. టెస్టుల్లో గత 8 ఇన్నింగ్స్​ల్లో రోహిత్ బ్యాట్ నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాలేదు.

సౌతాఫ్రికా టూర్​లో 5, 0, 39, 16తో దారుణంగా ఫెయిలైన హిట్​మ్యాన్.. ఇంగ్లండ్​తో తొలి రెండు టెస్టుల్లోనూ దీన్ని కంటిన్యూ చేశాడు. ఇంగ్లండ్​తో ఐదు టెస్టుల సిరీస్​ మొదలవడానికి ముందు టీమ్​లో అటాకింగ్ గేమ్ కల్చర్​ను తీసుకొచ్చానని చెప్పాడు రోహిత్. తమకు నంబర్స్, మైల్​స్టోన్స్, రికార్డుల కంటే జట్టు గెలుపే ముఖ్యమని చెప్పాడు. రికార్డులు, సెంచరీలను తాము పట్టించుకోవడం లేదని తెలిపాడు. స్వేచ్ఛగా ఆడటమే తమకు ముఖ్యమని​ అని.. టీమ్​లోని బ్యాటర్లు అందరూ ఇక మీదట దూకుడుగా ఆడతాడని చెప్పాడు. కానీ రోహితే వరుసగా ఫెయిల్ అయ్యాడు. దీంతో ఆ కామెంట్స్​ను సోషల్ మీడియాలో నెటిజన్స్ గుర్తుచేస్తున్నారు. హిట్​మ్యాన్ మాటలు చేతల్లో కనిపించడం లేదని, అసలు అతడికి ఏమైందని అంటున్నారు. మాటలకు అతడి ఆటతీరుకు పొంతనే కుదరడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రోహిత్ వైఫల్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments