Nidhan
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో టెస్టు మధ్యలో నుంచే ఇంటికి వెళ్లిపోయాడు. అతడు ఎందుకీ నిర్ణయం తీసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో టెస్టు మధ్యలో నుంచే ఇంటికి వెళ్లిపోయాడు. అతడు ఎందుకీ నిర్ణయం తీసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ మధ్యలోనే హఠాత్తుగా ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో అసలు ఏం జరిగింది? అతడు మ్యాచ్ ముగియక ముందే ఎందుకు వెళ్లిపోయాడనేది ఆసక్తికరంగా మారింది. రాజ్‌కోట్ టెస్టులో శుక్రవారం ఒక వికెట్ తీసిన అశ్విన్ 500 వికెట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా అశ్విన్ ఘనతకెక్కాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసి ధృవ్ జురెల్‌తో కలసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అలాంటోడు మ్యాచ్ నుంచి వైదొలగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానే అశ్విన్ ఇంటికి వెళ్లిపోయాడని బీసీసీఐ తెలిపింది.
రాజ్‌కోట్ టెస్టు నుంచి వైదొలిగిన అశ్విన్‌కు తాము మద్దతుగా ఉంటామని భారత క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి టీమ్‌తో పాటు బోర్డు అండగా నిలుస్తుందని పేర్కొంది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతోనే మూడో టెస్టుకు అశ్విన్ దూరమైనట్లు క్రికెట్ వర్గాల సమాచారం. ఈ మేరకు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ సిచ్యువేషన్లో తన తల్లికి దగ్గర ఉండటం కోసం అశ్విన్ మ్యాచ్ మధ్యలో నుంచి చెన్నైకి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అశ్విన్, అతడి కుటుంబ సభ్యుల గోప్యతకు మీడియా, అభిమానులు భంగం కలిగించకుండా ఉండాలని బోర్డు పేర్కొంది. ప్లేయర్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని తెలిపింది.
ఈ కష్టకాలంలో అశ్విన్‌కు అవసరమైన సాయాన్ని అందిస్తామని బీసీసీఐ పేర్కొంది. బోర్డుతో పాటు భారత టీమ్ మేనేజ్మెంట్ కూడా అతడికి అండగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక, రాజ్‌కోట్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బెన్ డకెట్ (138 నాటౌట్) సెంచరీతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో అశ్విన్, సిరాజ్ తలో వికెట్ తీశారు. బౌలర్లు పుంజుకొని ఇంగ్లీష్ టీమ్‌ను త్వరగా ఆలౌట్ చేస్తే మ్యాచ్‌పై పట్టుబిగించే అవకాశం ఉంటుంది. ఇలాంటి తరుణంలో అశ్విన్ వైదొలగడం పెద్ద ఎదురుదెబ్బే. ఇప్పుడు నలుగురు బౌలర్లతోనే భారత్ కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. ఈ సవాల్‌ను రోహిత్ సేన ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరి.. అశ్విన్ మ్యాచ్ మధ్యలో నుంచి వెళ్లిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: IND vs ENG: ఓలీ పోప్ ఔట్ పై వివాదం.. ఔటా? నాటౌటా?
Ravi Ashwin pulls out of the 3rd Test due to a family emergency. pic.twitter.com/2ofMAmld2f
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 16, 2024