Nidhan
భారత్-ఇంగ్లండ్ సిరీస్‌కు ఆడియెన్స్ నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ మ్యాచులకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
భారత్-ఇంగ్లండ్ సిరీస్‌కు ఆడియెన్స్ నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ మ్యాచులకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
Nidhan
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో రోహిత్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. అపోజిషన్ టీమ్‌ను 106 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.. 5 టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తద్వారా తొలి టెస్టులో ఓటమికి రివేంజ్ తీర్చుకుంది. ఇప్పుడు రాజ్‌కోట్‌లో జరగబోయే మూడో టెస్టు కోసం ప్రిపేర్ కానుంది. ఆ మ్యాచ్‌లోనూ నెగ్గితే సిరీస్‌లో 2-1తో లీడ్‌లోకి వెళ్లొచ్చు. ఇక, భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ చాలా విశేషాలకు వేదికగా మారింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లాంగ్ ఫార్మాట్‌కు ఆడియెన్స్ నుంచి వస్తున్న ఆదరణ. క్రికెట్లో సంప్రదాయకంగా చెప్పుకునే టెస్టులకు క్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. అలాంటిది భారత్-ఇంగ్లండ్ సిరీస్‌కు మాత్రం ప్రేక్షకులు, ఫ్యాన్స్ నుంచి ఫుల్ రెస్పాన్స్ కనిపిస్తోంది. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు ఏకంగా 40 కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. అయితే సరిగ్గా గమనిస్తే ఇన్ని వ్యూస్ రావడం వెనుక ఓ భయం ఉందని చెప్పొచ్చు.
టీమిండియా అనే కాదు క్రికెట్లో టాప్ కంట్రీస్‌గా చెప్పుకునే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లు టెస్టులు ఆడినా ఆడియెన్స్ పట్టించుకోవడం లేదు. ఐద్రోజుల పాటు జరిగే మ్యాచులు, గంటల కొద్దీ కూర్చొని చూడటం అవసరమా? అని చాలా మంది ప్రేక్షకులు అనుకుంటున్నారు. అందుకే టెస్టులను 4 రోజులకు కుదించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఒక్క సిరీస్‌తో వీటన్నింటికీ చెక్ పడింది. భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ఎవరూ ఊహించనంత రేంజ్లో రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టుకు వేలాది మంది ప్రేక్షకులు స్టేడియానికి క్యూ కట్టారు. మ్యాచ్ జరిగిన నాల్రోజులు గ్రౌండ్ మొత్తం హౌస్‌ఫుల్‌గా కనిపించింది. ఈ సిరీస్‌ను టెలికాస్ట్ చేస్తున్న జియో సినిమాలో కూడా వ్యూస్ భారీ సంఖ్యలో వచ్చాయి. వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టుకూ ప్రేక్షకులు, అభిమానులు భారీగా స్టేడియానికి తరలివచ్చారు. ఇక, డిజిటల్ స్ట్రీమింగ్‌లో అయితే రికార్డు క్రియేట్ అయింది.
సెకండ్ టెస్ట్‌కు ఏకంగా 41 కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. అయితే ఇంత మంది టెస్టులను ఎగబడి మరీ చూడటానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. రెండు టాప్ టీమ్స్ తలపడుతుండటం ఒక కారణమైతే.. రెండోది బజ్‌బాల్. స్వదేశంలో ఇండియాను టెస్టుల్లో కొట్టే టీమే లేదు. కానీ ఇంగ్లండ్ బజ్‌బాల్ ఫార్ములా వల్ల మన టీమ్ ఓడుతుందేమోననే భయం ఆడియెన్స్‌లో ఏర్పడింది. సిరీస్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడిపోవడం.. రెండో టెస్టు నెగ్గడం కీలకం కావడం, భారత్ విజయానికి చేరువలో ఉండటంతో కోట్లాది మంది ఫోన్లు, టీవీల్లో మ్యాచును లైవ్ చూస్తూ ఎంజాయ్ చేశారు. ఆస్ట్రేలియాతో పాటు పలు తోపు జట్లను బజ్‌బాల్ క్రికెట్‌తో భయపెట్టిస్తున్న ఇంగ్లండ్ వల్ల ఈ సిరీస్‌కు వ్యూస్ భారీగా పెరిగాయి. రెండు జట్లు నువ్వానేనా అంటూ పోరాడటం, లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌ను మించిన మజా పంచుతుండటంతో ఫ్యాన్స్ మ్యాచులు చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని క్రికెట్ అనలిస్టులు కూడా అంటున్నారు. మరి.. భారత్-ఇంగ్లండ్ సిరీస్‌కు భారీ సంఖ్యలో వ్యూస్ రావడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
India Vs England 2nd Test generated more than 41cr total views on JioCinema in 4 days. pic.twitter.com/b7QZDYIA46
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 5, 2024