Jasprit Bumrah: నిప్పులు చెరిగే బౌలింగ్​తో బుమ్రా విధ్వంసం.. తన సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పేశాడు!

టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా తన విశ్వరూపం చూపించాడు. నిప్పులు చెరిగే బంతులతో చెలరేగి ఇంగ్లండ్​ ఇన్నింగ్స్​ను చూస్తుండగానే కుప్పకూల్చాడు.

టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా తన విశ్వరూపం చూపించాడు. నిప్పులు చెరిగే బంతులతో చెలరేగి ఇంగ్లండ్​ ఇన్నింగ్స్​ను చూస్తుండగానే కుప్పకూల్చాడు.

ఇంగ్లండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా విధ్వంసం సృష్టించాడు. 15.5 ఓవర్లు వేసిన అతడు 45 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. బుమ్రా వేసిన ఓవర్లలో 5 మెయిడిన్లు కావడం విశేషం. దీన్ని బట్టే అతడు ఏ రేంజ్​లో ఇంగ్లండ్ బ్యాటర్లకు పోయించాడో అర్థం చేసుకోవచ్చు. బ్రేక్ త్రూ అవసరమైన ప్రతిసారి కెప్టెన్ రోహిత్ శర్మ చూపు బుమ్రా మీదకే వెళ్లింది. సారథి తన మీద ఉంచిన నమ్మకాన్ని బుమ్రా ఏమాత్రం వమ్ము చేయలేదు. ప్రతి స్పెల్​లో కసితో బౌలింగ్ చేసి ఇంగ్లండ్​ కుప్పకూలడంలో కీలకపాత్ర పోషించాడు. పిచ్​ నుంచి రివర్స్ స్వింగ్​కు కాస్త సహకారం లభించడంతో అతడు చెలరేగిపోయాడు. ఇంగ్లీష్ జట్టులో కీలక బ్యాటర్లు అయిన జో రూట్, జానీ బెయిర్​స్టో, ఓలీ పాప్​​తో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్​నూ బుమ్రానే పెవిలియన్​కు పంపాడు. అలాంటోడు తన బౌలింగ్ సీక్రెట్ ఏంటో చెప్పేశాడు.

రెండో టెస్టులో రెచ్చిపోయి బౌలింగ్​ చేస్తున్న బుమ్రా మైల్​స్టోన్స్​ గురించి అస్సలు ఆలోచించనని చెప్పాడు. ఇదే తన సక్సెస్ సీక్రెట్ అని తెలిపాడు. భారత జట్టుకు టెస్టుల్లో ఎక్కువ కాలం పాటు సేవలు అందించాలని అనుకుంటున్నానని తెలిపాడు. ‘నంబర్లు, రికార్డులు, మైల్​స్టోన్స్ గురించి పట్టించుకోవడం మానేశా. వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఎందుకంటే అది నన్ను అదనపు ఒత్తిడికి గురిచేస్తుంది. నేను నా దేశానికి మంచి చేయాలని అనుకుంటున్నా. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాలని భావిస్తున్నా. టెస్టుల్లో ఎక్కువ కాలం కొనసాగాలనేది నా కోరిక’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. బుమ్రా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. గెలుపు కోసం ఆడే ఇలాంటి ప్లేయర్లు టీమ్​లో ఉండటం చాలా ముఖ్యమని అంటున్నారు. బుమ్రా బౌలింగ్ సూపర్ అని.. అతడు ఇదే ఫామ్​ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు.

ఇక, ఇండియన్ పిచ్​లు  స్పిన్​కు స్వర్గధామం అనేది తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో భారత్ ఆడుతోందంటే చాలు టర్నింగ్ ట్రాక్స్​నే సిద్ధం చేస్తారు. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. మన టీమ్​లో అద్భుతంగా బాల్​ను టర్న్ చేసే స్పిన్నర్లు, బాల్ టర్న్ అయినా ఈజీగా రన్స్ చేసే బ్యాటర్స్ ఉంటారు కాబట్టి స్పిన్ వికెట్లను రెడీ చేస్తారు. అందుకే టీమిండియా సొంతగడ్డపై ఆడే మ్యాచుల్లో ఎక్కువ వికెట్లు స్పిన్నర్లకే దక్కుతుంటాయి. కానీ బుమ్రా మాత్రం టర్నింగ్ ట్రాక్స్, ఫ్లాట్ పిచెస్​ అనేది పట్టించుకోవడం లేదు. తన బలమైన యార్కర్, రివర్స్ స్వింగ్, లో బాల్స్, స్లో బాల్స్​తో బ్యాటర్లను పోయిస్తున్నాడు. బ్రేక్ త్రూ కావాలనుకున్న ప్రతిసారి వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. మరి.. బుమ్రా బౌలింగ్ వేస్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments