IND vs ENG: ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఆసీస్ కెప్టెన్ కమిన్స్!

ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమిని అటు ప్లేయర్లతో పాటు ఇటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమిని అటు ప్లేయర్లతో పాటు ఇటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

గత వారం క్రికెట్​లో రెండు వింతలు చోటు చేసుకున్నాయి. సొంతగడ్డపై సింహాలు లాంటి రెండు జట్లు ఓటమిని ఎదుర్కొన్నాయి. అవే భారత్, ఆస్ట్రేలియా. టీమిండియాను సొంతగడ్డ మీద ఓడించలేక ఎన్నో జట్లు తోకముడుచుకున్నాయి. సిరీస్​ను పక్కనబెడితే కనీసం వైట్​వాష్ తప్పించుకుంటే చాలని టాప్ టీమ్స్ కూడా భావిస్తాయి. ఆసీస్​లో కంగారూలతో ఆడేటప్పుడు కూడా మిగతా జట్లు ఇలాగే ఆలోచిస్తాయి. అయితే అనూహ్యంగా సొంతగడ్డపై జరిగిన టెస్టుల్లో అటు వెస్టిండీస్ చేతితో ఆసీస్ ఓడిపోగా.. ఇటు భారత్​ను ఇంగ్లండ్ ఓడించింది. స్టార్లతో నిండిన రోహిత్ సేన ఓటమిని ఎవరూ ఊహించలేదు. మొదటి టెస్ట్​లో మూడో రోజు వరకు ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చి ఇలా ఓడిపోతుందని ఎవరూ ఎక్స్​పెక్ట్ చేయలేదు. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా నిరాశలో కూరుకున్నారు. ఈ తరుణంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్లిద్దరూ ఉన్నంత వరకు భారత్​కు ఏమీ కాదన్నాడు.

టీమిండియాపై ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు ఉన్నంత వరకు భారత జట్టుకు తిరుగులేదని అతడు అన్నాడు. వాళ్లిద్దరూ చాలా నిలకడగా ఆడతారని.. వాళ్లు మ్యాచ్​లో ఉన్నారంటే ప్రత్యర్థులకు వణుకు పుట్టడం ఖాయమన్నాడు. టీమ్​ను ఎలాగైనా గెలుపు తీరాలకు చేర్చాలని వాళ్లిద్దరూ ప్రయత్నిస్తుంటారని.. అందుకోసం కొత్త దారులు అన్వేషిస్తుంటారని మెచ్చుకున్నాడు కమిన్స్. ‘కోహ్లీ, జడేజా చాలా కన్​సిస్టెంట్​గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. వాళ్లను ఆటకు దూరంగా ఉంచలేరు. జట్టు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా వాళ్లు అందులో నుంచి బయట పడేస్తారు. కఠిన పరిస్థితుల్లోనూ రాణించి టీమ్​ను గెలిపిస్తారు. వాళ్లిద్దరూ చాలా స్పెషల్ ప్లేయర్లు’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఐసీసీ అవార్డులపై స్పందిస్తూ అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఐసీసీ క్రికెటర్ ఆఫ్​ ది ఇయర్-2023 అవార్డును కమిన్స్ దక్కించుకున్నాడు. ఇదే ఏడాదికి గానూ ఓడీఐ క్రికెటర్ ఆఫ్​ ఇయర్​గా కోహ్లీ నిలిచాడు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ.. తన క్రికెట్ జర్నీతో పాటు కోహ్లీ, జడేజా గురించి కూడా కమిన్స్ పలు విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ ఇద్దరు భారత స్టార్లతో పాటు తన టీమ్​మేట్ ట్రావిస్ హెడ్​ మీద కూడా ప్రశంసల జల్లులు కురిపించాడు. గతేడాది తనకు బాగా కలిసొచ్చిందన్నాడు. ఒకే సంవత్సరం ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​తో పాటు వన్డే వరల్డ్ కప్ నెగ్గడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇప్పుడు ఐసీసీ అవార్డు కూడా దక్కడం తన ఆనందాన్ని రెట్టింపు చేసిందన్నాడు. ‘గతేడాది నాకు చాలా కలిసొచ్చింది. ఓ జట్టుగా మేం అద్భుత విజయాలు సాధించాం. ఐసీసీ అవార్డు రావడం గౌరవంగా ఉంది’ అని కమిన్స్ తెలిపాడు. మరి.. కోహ్లీ, జడేజా ఉన్నన్ని రోజులు భారత్​కు ఢోకా లేదంటూ ఆసీస్ కెప్టెన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments