IND vs ENG: టీమిండియాతో టెస్ట్.. ఇంగ్లండ్​కు భారీ షాక్.. ఇక గెలుపు గురించి మర్చిపోవాలి!

వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆ టీమ్ విజయంపై ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆ టీమ్ విజయంపై ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసకందాయంలో పడింది. ఇరు టీమ్స్ నువ్వానేనా అంటూ ఆడుతుండటంతో తొలి టెస్టులోలాగే ఈ మ్యాచ్​లో కూడా క్లోజ్ ఫినిష్ తప్పేలా లేదు. కాగా, వైజాగ్ టెస్ట్​లో ఇంగ్లీష్ టీమ్​కు అనూహ్యంగా బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ జో రూట్​ గాయం బారిన పడ్డాడు. మూడో రోజు ఫస్ట్ సెషన్​లో స్లిప్​లో ఫీల్డింగ్ చేస్తుండగా అతడు గాయపడ్డాడు. అయితే ప్రాథమిక చికిత్స తర్వాత అతడు తిరిగి గ్రౌండ్​లోకి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ లంచ్ ముగిసింది, ఆ తర్వాత రెండో సెషన్ ముగిసినా మైదానంలోకి అతడు అడుగు పెట్టలేదు. దీంతో అసలు రూట్​కు ఏమైందనే ప్రశ్నలు తలెత్తాయి.

జో రూట్ అసలు ఆడతాడా? లేదా? గాయం తీవ్రత పెరిగిందా? అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. అయితే అతడి గాయంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అప్​డేట్ ఇచ్చింది. స్టార్ బ్యాటర్ కుడి చేతి వేలికి ఇంజ్యురీ అయిందని వెల్లడించింది. రూట్ ప్రస్తుతం తమ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపింది. అయితే అతడు తిరిగి ఎప్పుడు గ్రౌండ్​లో అడుగుపెడతాడో మాత్రం చెప్పలేమని పేర్కొంది. కాగా, గాయం తర్వాత గ్రౌండ్​ను వీడిన రూట్.. మళ్లీ డ్రెస్సింగ్ రూమ్​లో కూడా కనిపించలేదు. ఒకవేళ అతడి ఇంజ్యురీ గనుక తీవ్రమైతే మాత్రం రెండో ఇన్నింగ్స్​లో అతడు బ్యాటింగ్​కు దిగకపోవచ్చు.

గాయం కారణంగా భారత సెకండ్ ఇన్నింగ్స్​ సమయంలో రూట్ కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌల్ చేశాడు. అతడు తిరిగి రాకపోవడంతో నలుగురు బౌలర్లతోనే బౌలింగ్​ను కంటిన్యూ చేశాడు కెప్టెన్ బెన్ స్టోక్స్. అయితే రూట్ అవసరం ఇప్పుడు ఇంగ్లీష్ టీమ్​కు చాలా ఉంది. ఎలాగూ భారత్​ను ఆలౌట్ చేసేశారు. గెలవాలంటే 399 పరుగుల భారీ స్కోరు చేయాలి. ఇప్పటికే బెన్ డకెట్ (28) ఔటయ్యాడు. విజయానికి ఇంకా 332 పరుగుల అవసరం ఉంది. ఇంకో వికెట్ పడితే రూట్ క్రీజులోకి రావాలి. మూడో రోజు ఆట ముగిసింది కాబట్టి నాలుగో రోజు పొద్దున వరకు అతడు ఫిట్​గా ఉండాలి. ఒకవేళ గాయం తగ్గకపోతే మాత్రం ఇంగ్లండ్​కు కష్టమే. చెలరేగి బౌలింగ్ చేస్తున్న బుమ్రా, అశ్విన్​ను ఎదుర్కోవాలంటే రూట్ అందుబాటులో ఉండటం తప్పనిసరి. అతడు లేకపోతే అది వాళ్ల విజయావకాశాలను భారీగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. మరి.. రూట్ రూపంలో ఇంగ్లండ్​కు షాక్ తగలడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: గిల్ అరుదైన ఘనత.. సచిన్, కోహ్లీ సరసన చోటు!

Show comments