Nidhan
ఉప్పల్ టెస్టులో ఇంగ్లండ్ చేతుల్లో జరిగిన పరాభవానికి టీమిండియా రివేంజ్ తీర్చుకుంది. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో ప్రత్యర్థి జట్టును చిత్తుగా ఓడించింది.
ఉప్పల్ టెస్టులో ఇంగ్లండ్ చేతుల్లో జరిగిన పరాభవానికి టీమిండియా రివేంజ్ తీర్చుకుంది. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో ప్రత్యర్థి జట్టును చిత్తుగా ఓడించింది.
Nidhan
ఉప్పల్ టెస్టులో జరిగిన పరాభవానికి టీమిండియా రివేంజ్ తీర్చుకుంది. సొంతగడ్డపై ఇదేం ఆటతీరు, ఇలాగే ఆడితే సిరీస్ ఇక గెలిచినట్లేనంటూ వచ్చిన విమర్శలకు రెండో టెస్టులో అదిరిపోయే రీతిలో ఆన్సర్ ఇచ్చింది. రోహిత్ సేన ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్ ముందు అపోజిషన్ టీమ్ నిలబడలేకపోయింది. మన బౌలర్ల దెబ్బకు భారీ లక్ష్య ఛేదనలో తుస్సుమంది ఇంగ్లండ్. 600 పరుగులైనా సరే ఛేజ్ చేస్తామంటూ ఓవర్ యాక్షన్ చేసిన ఇంగ్లీష్ టీమ్ బెండు తీశారు మన ప్లేయర్లు. 398 పరుగుల ఛేదనకు దిగిన ప్రత్యర్థి జట్టును 292 పరుగులకే కుప్పకూల్చారు. తద్వారా 106 పరుగుల తేడాతో నెగ్గి సిరీస్‌ను 1-1తో సమం చేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్ టెస్ట్‌లో భారత్ విజయానికి గల 5 కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
జైస్వాల్
ఫస్ట్ టెస్ట్‌లో బ్యాటింగ్ యూనిట్ ఫెయిలవడంతో ఓటమిని మూటగట్టుకుంది భారత్. అదే సమస్య రెండో టెస్టులోనూ కంటిన్యూ అయింది. వైజాగ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మన టీమ్ బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. కానీ ఒక ఎండ్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (209 పరుగులు) పాతుకుపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లకు సింహస్వప్నంలా మారి బౌండరీలు, భారీ సిక్సులు బాదుతూ భయపెట్టాడు. ఎవ్వరు ఔటైనా తాను మాత్రం ఒక ఎండ్‌ను కాపాడుకుంటూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. సింగిల్స్, డబుల్స్ తీస్తూనే వీలు కుదిరినప్పుడు ఫోర్లు, సిక్సులు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జట్టు 396 పరుగులు చేస్తే.. అందులో సగానికి పైగా రన్స్ అతడి బ్యాట్ నుంచి వచ్చినవే కావడం విశేషం.
బుమ్రా
భారత్ విజయానికి రెండో కారణం పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా. వైజాగ్ వికెట్ అటు పేస్‌తో పాటు ఇటు స్పిన్‌కు కూడా అంతగా అనుకూలించలేదు. క్రీజులో నిలబడితే ఈజీగా పరుగులు వస్తున్నాయి. అయినా ఇలాంటి పిచ్ మీద రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీశాడు బుమ్రా. రివర్స్ స్వింగ్, యార్కర్స్‌తో ఇంగ్లీష్ బ్యాటర్లను భయపెట్టాడు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్, గిల్ బ్యాటింగ్‌లో హీరోలైతే బౌలింగ్‌లో బుమ్రా హీరో అని చెప్పాలి.
రవిచంద్రన్ అశ్విన్
తొలి టెస్టులో విఫలమైన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ ఫెయిలయ్యాడు. ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు వేసిన అశ్విన్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కీలకమైన ముగ్గురు బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చాడు. బెన్ డకెట్, ఓలీ పాప్‌తో పాటు జో రూట్‌ను ఔట్ చేసి విజయంలో తన పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి బ్యాట్‌తో విలువైన 49 పరుగులు జోడించాడు. అతడి అనుభవం టీమ్‌కు బిగ్ ప్లస్ అయింది.
రోహిత్ శర్మ
వైజాగ్ టెస్టులో భారత్ గెలుపునకు రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా ఓ కారణం. ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారీ స్కోర్లు చేయకుండా అతడు అడ్డుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే, బెన్ స్టోక్స్ ప్రమాదకరంగా కనిపించిన సమయంలో అక్షర్, బుమ్రాను బౌలింగ్‌కు తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు. వికెట్ నుంచి పేస్‌కు కాస్త మద్దతు దొరుకుతుండటంతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బుమ్రాతో ఎక్కువ ఓవర్లు వేయించాడు. ఈ మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌లో ఫెయిలైనా.. బౌలింగ్ ఛేంజెస్, ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్, డీఆర్ఎస్ తీసుకోవడం లాంటి వాటిల్లో తెలివిగా వ్యవహరించి జట్టుకు విజయాన్ని అందించాడు.
బౌలింగ్
రెండో టెస్టులో టీమిండియా సక్సెస్‌లో బ్యాటర్ల కంటే బౌలర్లకే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. బ్యాటింగ్‌లో జైస్వాల్, గిల్ మాత్రమే రాణించారు. కానీ బౌలింగ్‌లో మాత్రం బుమ్రా, అశ్విన్, అక్షర్, కుల్దీప్, ముకేష్ అదరగొట్టారు. ఒక్క ఇన్నింగ్స్‌లోనూ ప్రత్యర్థి జట్టు స్కోరు 300 దాటకుండా అడ్డుకున్నారు. ఒక్క ఇంగ్లీష్ బ్యాటర్ కూడా సెంచరీ చేయకుండా నిలువరించారు. ముఖ్యంగా బుమ్రా, కుల్దీప్, అశ్విన్ సూపర్బ్ స్పెల్స్‌తో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. మరి.. ఈ మ్యాచ్‌లో మన జట్టు విజయానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటే కామెంట్ చేయండి.
INDIA DEFEATED BAZ-BALL AT VIZAG 🇮🇳 🔥pic.twitter.com/gBOLhar14y
— Johns. (@CricCrazyJohns) February 5, 2024